Share News

First Flying Taxi: మరికొద్దిరోజుల్లో ఫ్లైయింగ్ ట్యాక్సీ.. ధర కూడా తక్కువే.. ఎంతంటే!!

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:11 PM

ఫ్లైయింగ్ ట్యాక్సీని ఐఐటీ మద్రాస్‌ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి రూపొందించారు. ఆ ట్యాక్సీకి e200 అని పేరు కూడా పెట్టారు. తన ఫ్లైయింగ్ ట్యాక్సీకి సంబంధించిన వివరాలను సత్య చక్రవర్తి మీడియాకు వెల్లడించారు. e200 ట్యాక్సీ రూపకల్పన, భద్రత ప్రమాణాలు, నియంత్రణ, పట్టణ రవాణాపై ప్రభావం లాంటి అంశాలను వివరించారు.

First Flying Taxi: మరికొద్దిరోజుల్లో ఫ్లైయింగ్ ట్యాక్సీ.. ధర కూడా తక్కువే.. ఎంతంటే!!

ఏబీఎన్ ఇంటర్నెట్: ఇక ఆకాశంలో రయ్ రయ్ మని తిరగొచ్చు. అది కూడా తక్కువ ధరకే. మరో 7-8 నెలల్లో ఫ్లైయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి రాబోతున్నాయి. అవి బ్యాటరీతో నడిచే ఫ్లైయింగ్ ట్యాక్సీలు (Flying Taxi). ఫ్లైయింగ్ ట్యాక్సీ (Flying Taxi) అంటే ధర ఎక్కువ ఉంటుందని అనుకునేరు. ఉబెర్ ట్యాక్సీ (Uber) కన్నా డబుల్ ఉంటుందట. తక్కువ ధరలో.. గగనతలంలో విహరిస్తూ గమ్య స్థానానికి చేరుకునే అవకాశం కలుగనుంది.

e200 ఫ్లైయింగ్ ట్యాక్సీ

ఫ్లైయింగ్ ట్యాక్సీని (Flying Taxi) ఐఐటీ మద్రాస్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి రూపొందించారు. ఆ ట్యాక్సీ e200 అని పేరు కూడా పెట్టారు. తన ఫ్లైయింగ్ ట్యాక్సీకి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. e200 ట్యాక్సీ రూపకల్పన, భద్రత ప్రమాణాలు, నియంత్రణ, పట్టణ రవాణాపై ప్రభావం లాంటి అంశాలను వివరించారు. ఫ్లైట్ ట్యాక్సీ రూపక్పలనలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఇరుకైన ప్రదేశాల్లో కూడా దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రద్దీగా ఉండే ఆకాశం మీదుగా సులభంగా ప్రయాణించొచ్చు అని వివరించారు. తొలుత బ్యాటరీని పరీక్షిస్తామని, తక్కువ దూరం ప్రయాణం చేస్తామని తెలిపారు.

అక్టోబర్-నవంబర్‌లో సేవలు

ఫ్లైయింగ్ ట్యాక్సీ అన్ని సవాళ్లను ఎదుర్కొందని, నిర్వహించిన అన్ని పరీక్షల్లో సక్సెస్ అయ్యిందని సత్య చక్రవర్తి తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్- నవంబర్‌లో తొలి ఫ్లైట్ సర్వీసు ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు e200 ట్యాక్సీలో పారాచూట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఫ్లైయింగ్ ఫ్లైట్ సామాన్యులకు అందుబాటులో ఉండనుంది. ఉబెర్ రైడ్ ధర కన్నా రెట్టింపు ఉంటుందని చక్రవర్తి చెబుతున్నారు. తమ ఫ్లైయింగ్ ట్యాక్సీ ద్వారా ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని సత్య చక్రవర్తి వివరించారు. మరో 7,8 నెలల్లో ఆకాశంలో రయ్ మని తిరిగే అవకాశం ఉందని సత్య చక్రవర్తి చెబుతున్నారు. తమ ఫ్లైయింగ్ ట్యాక్సీల వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 02:11 PM