Share News

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

ABN , Publish Date - May 03 , 2024 | 11:37 AM

విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.

Dudhiya Maldah: నీటితో కాదండోయ్. ఏకంగా పాలతో పండించిన మామిడి ఇది.. దీని క్రేజ్ తెలిస్తే షాకవుతారు..!

సాధారణంగా ఏ చెట్లను అయినా నీరు పోసి పెంచుతారు. విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది. అసలు ఈ దుధియా మాల్దా ఏంటి? దీన్ని పాలతో పండించడం వెనుక కథ ఏంటి? దీనికున్న క్రేజ్ ఏంటి? తెలుసుకుంటే..

విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!


దుధియా మాల్దా.. మామిడి పండులో విత్తనం చిన్నగా ఉంటుంది. పండు మొత్తం గుజ్జుతో పసందుగా ఉంటుంది. దీని పొట్టు పలుచగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మామిడి పండు మీద పాలలాగా తెల్లగా ఉంటుంది. ఈ పండు గురించి భారతీయులకు ఎంత తెలుసో ఏమో కానీ.. ఈ పండు ప్రత్యేకత, దీని రుచి 33దేశాలకు తెలుసు. భారత్ లో పాట్నాలోని బీహార్ విద్యాపీఠ్ ల ఉన్న మామిడి తోటలో ఈ మొక్కలు పెరుగుతున్నాయి. లక్నోకు చెందిన వ్యక్తి నవాబ్ ఫిదా హుస్సేన్ పాకిస్తాన్ లని ఇస్లామాబాద్ లోని షా ఫైసల్ మసీదు ప్రాంతం నుండి ఓ మామిడి మొక్కను తీసుకువచ్చి పాట్నాలోని దిఘాలో నాటాడు. అప్పట్లో నవాబ్ సాహిబ్ కు ఆవులు దండిగా ఉండేవి. వాటి పాలు చాలా మిగిలిపోతే ఆ పాలను మొక్కలకు పోసేవాడు. క్రమంగా మామిడి మొక్క పెరిగి పెద్దదై కాయలు కాసింది. ఆ కాయలు అమితమైన రుచి ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగానే ఈ మామిడికి దుధియా మాల్దా అనే పేరు కూడా పెట్టారు.

అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!


ప్రస్తుతం బీహార్ విద్యాపీఠ్ లో 50 దుధియా మాల్దా చెట్లు, పాట్నాలో 1000 మామిడి చెట్లు ఉన్నాయి. ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 100 వరకు ఉంటున్నాయి. గత ఏడాది ఈ మామిడి పండ్లను 33 దేశాలకు ఎగుమతి చేశారు. ప్రధాని, రాష్ట్రపతి నుండి ఎంతో మంది నేతలకు ప్రతి యేడు ఈ మామిడి పండ్లు పంపిస్తున్నారు. USA, ఇంగ్లాండ్, జపాన్, దుబాయ్ తో సహా అన్ని దేశాలకు ఈ పండ్లు ఎగుమతి అవుతున్నాయి.

విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!

తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 03 , 2024 | 11:37 AM