Share News

Viral Video: కర్ణాటకలో వైభవంగా సంప్రదాయ తుతేదర ఉత్సవం.. భక్తుల కోలాహలం

ABN , Publish Date - Apr 21 , 2024 | 09:08 AM

కర్ణాటక(Karnataka)లోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఎక్కువగా పూజించే ఆరాధ్యదైవం శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయ (Durgaparameshwari Temple) వార్షిక జాత్రా మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి ఆలయం ఎదురుగా ఉన్న రథబీడి వద్ద సంప్రదాయ తుతేదర(Thootedhara) ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Viral Video:  కర్ణాటకలో వైభవంగా సంప్రదాయ తుతేదర ఉత్సవం.. భక్తుల కోలాహలం
Agni Keli Sri Durgaparameshwari Temple

కర్ణాటక(Karnataka)లోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఎక్కువగా పూజించే ఆరాధ్యదైవం శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయ (Durgaparameshwari Temple) వార్షిక జాత్రా మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. రాత్రి ఆలయం ఎదురుగా ఉన్న రథబీడి వద్ద సంప్రదాయ తుతేదర(Thootedhara) ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగమైన అగ్నికేళి (Agni Keli) కార్యక్రమం చూపరులను ఆకట్టుకుంది. వ్రత నియమావళికి వచ్చిన భక్తుల బృందం కొబ్బరి ఆకులను వెలిగించి ఆ నిప్పు కణికలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. వందలాది మంది గుంపులుగా చేరి విసురుకున్న ఆ దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అయితే ప్రతి ఏటా జరిగే శ్రీదుర్గాదేవీ(Durgaparameshwari) జాతర ఉత్సవాల సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. చివరి రోజున అమ్మవారి అవభృత స్నానం జరుగుతుంది. అనంతరం జరిగే ఈ నిప్పుల ఆట దేవుడికి ఇష్టమని భక్తుల విశ్వాసం. దుష్టశక్తులను సంహరించిన దేవతను శాంతింపజేసేందుకు గతంలో ఈ తరహా ఆట ఆడేవారని తెలుస్తోంది. అయితే ఈ వేడుకలో ఇప్పటి వరకు చరిత్రలో ఎవరూ గాయపడలేదని సమాచారం. కనీసం బట్టలకు కూడా మంటలు అంటుకోలేదట. అయితే ఎవరికీ ఏమీ జరగకపోవడానికి కారణం ఇక్కడి అమ్మవారి మహిమేనని అందరి నమ్మకం.


ఈ ఉత్సవం విశేషాల విషయానికి వస్తే.. దేవుడికి పూజలు చేసిన తర్వాత జరిగే ఈ పోరులో పాల్గొనే ఇరు జట్లకు ప్రసాదం అందజేస్తారు. భక్తులు తమ చర్మంపై అమ్మవారి కుంకుమను పూసుకుంటారు. ఇది లాంఛనప్రాయ పోరాటమే అయినప్పటికీ ఈ సందర్భంగా మాత్రమే నిజమైన శత్రువులు ఆవేశంతో పోరాడుతారు. కొన్నిసార్లు ఇది విపరీతంగా ఉంటుంది. వీరిని నియంత్రించేందుకు స్థానికులు కూడా సిద్ధంగా ఉంటారు. ఇలా మూడుసార్లు నిప్పులు విసురుతూ వెనక్కి కదిలేవారు ఓడిపోతారు. అందుకే గెలవాలనే తపనతో పోరాడుతారు. ఈ ఆట తర్వాత అందరూ కలిసి దేవుడిని దర్శించుకుని తమ ఊర్లకు వెళతారు. నిప్పులు కురిపించే ఈ సంప్రదాయం(culture) ఎప్పటి నుంచో ఉంది.


ఇది కూడా చదవండి:

IPL 2024: నేడు మధ్యాహ్నం RCB vs KKR మ్యాచ్.. బెంగళూరుకు డూ ఆర్ డై మ్యాచ్


Gold and Silver Rates: నేడు స్థిరంగా గోల్డ్ రేట్లు.. కానీ గత 10 రోజుల్లో ఏకంగా..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 06:25 PM