Share News

Gold and Silver Rates: నేడు స్థిరంగా గోల్డ్ రేట్లు.. కానీ గత 10 రోజుల్లో ఏకంగా..

ABN , Publish Date - Apr 21 , 2024 | 07:20 AM

గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనుకాగా ఈరోజు నేడు (ఏప్రిల్ 21న) మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,240గా ఉంది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.68,050గా ఉంది. అయితే గత 10 రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ మేరకు పెరిగాయో ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates: నేడు స్థిరంగా గోల్డ్ రేట్లు.. కానీ గత 10 రోజుల్లో ఏకంగా..
gold and silver rates april 21st 2024

గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనుకాగా ఈరోజు (ఏప్రిల్- 21న) మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,240గా ఉంది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.68,050గా ఉంది. మరోవైపు గత 10 రోజుల్లోనే పుత్తడి రేట్లు దాదాపు 2000 వేల రూపాయలు పెరగడం విశేషం. ఇదే నెలలో ఏప్రిల్ 10న గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు రూ.65,996గా ఉంది.


ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,048గా ఉండేది. అయితే 10 రోజుల్లోనే ఇలా పెరిగితే త్వరలో గోల్డ్ ఇంకా ఎంత పెరుగుతుందోనని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు మాత్రం పుత్తడి రేట్లు లక్ష రూపాయలకు చేరుకుంటాయని అంటున్నారు. ఇక్కడ గోల్డ్ రేట్లు ద్రవ్యోల్బణం, గ్లోబల్ పాలసీలు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సహా దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి.


ఇక దేశంలో సిల్వర్(silver) రేటు విషయానికి వస్తే ఇవి కూడా నేడు(ఏప్రిల్ 21న) స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.90000గా ఉంది. అయితే వెండి మాత్రం గత 10 రోజుల్లో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెరిగింది. పుత్తడితో పోల్చుకుంటే స్పల్పంగా పెరిగిందని చెప్పవచ్చు. ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.89000గా ఉంది. కాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ.86,500గా ఉంది.


ఇది కూడా చదవండి:

Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే


Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 07:26 AM