' frameborder='0' allow='autoplay; encrypted-media' allowfullscreen='true' style='width:100%; display: block;' loading=\"lazy\">", "url": "https://www.andhrajyothy.com/2024/prathyekam/a-video-of-a-young-man-dancing-in-the-delhi-metro-has-gone-viral-on-social-media-gns-1193271.html", "datePublished": "2024-01-08T15:09:53+05:30", "dateModified": "2024-01-08T15:10:45+05:30", "dateCreated": "2024-01-08T15:09:53+05:30", "thumbnailUrl": "https://media.andhrajyothy.com/media/2023/20231205/delhi_metro_f68b60bb7e.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.andhrajyothy.com/2024/prathyekam/a-video-of-a-young-man-dancing-in-the-delhi-metro-has-gone-viral-on-social-media-gns-1193271.html", "name": "A video of a young man dancing in the Delhi Metro has gone viral on social media gns ", "image": { "@type": "ImageObject", "url": "https://media.andhrajyothy.com/media/2023/20231205/delhi_metro_f68b60bb7e.jpg", "width": "1280", "height": "720" } }, "image": { "@type": "ImageObject", "url": "https://media.andhrajyothy.com/media/2023/20231205/delhi_metro_f68b60bb7e.jpg", "width": "1280", "height": "720" }, "author": { "@type":"Person", "name":"ABN", "url":"https://www.andhrajyothy.com/author" }, "publisher": { "@type": "Organization", "name": "Andhrajyothy", "url": "https://www.andhrajyothy.com/", "logo": { "@type": "ImageObject", "url": "https://media.andhrajyothy.com/media/abn-600x60.png", "width": 600, "height": 60 } } }
Share News

Delhi Metro: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. మెట్రో అనే ఇంగితం కూడా లేకుండా..

ABN , Publish Date - Jan 08 , 2024 | 03:09 PM

దిల్లీ మెట్రో.. ఈ పేరు చెబితే చాలు.. చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయి. లవర్స్ కు అడ్డాగా మారిందని,

Delhi Metro: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. మెట్రో అనే ఇంగితం కూడా లేకుండా..

దిల్లీ మెట్రో.. ఈ పేరు చెబితే చాలు.. చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ గుర్తుకు వస్తాయి. లవర్స్ కు అడ్డాగా మారిందని, జనాలు ఉన్నారన్న సోయి కూడా లేకుండా కొందరు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో దిల్లీ మెట్రో ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారుతోంది. ప్రజా రవాణాలో మెట్రో రైలు ముఖ్యపాత్ర వహిస్తుంది. దేశ రాజధాని కావడంతో అన్ని రకాల కార్యకలాపాలు దిల్లీ నుంచే సాగుతాయి. కాబట్టి ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. త్వరగా గమ్యానికి చేరుకోవడానికి మెట్రోను ఆశ్రయిస్తుంటారు. అలాంటి సమయాల్లో కొందరు చేస్తున్న వింత చేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా.. జరిగిన ఈ ఘటనతో దిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది.

సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతోంది. ఇందులో టింకూ జియా అనే పాటపై ఓ యువకుడు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అతడి డ్యాన్స్ చూసిన తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఇది మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. ముద్దు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, తల దువ్వుకోవడం వంటి ఘటనలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.


ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ప్రయాణం చేసే అవకాశం లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. లేకుండా మెట్రో సర్వీసులను నిలిపివేయడమే మంచిదని ఘాటు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 03:10 PM