Share News

Viral: ఎట్టా ఎట్టా దూరావ్ బాసూ.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..

ABN , Publish Date - Jan 10 , 2024 | 01:14 PM

ఎవరైనా.. పార్టీకి వెళ్తే అందరితో కలివిడిగా కలిసిపోతారు. పాత దోస్తులు, తోటి ఉద్యోగులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లతో పిచ్చాపాటి ముచ్చట్లతో

Viral: ఎట్టా ఎట్టా దూరావ్ బాసూ.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..

ఎవరైనా.. పార్టీకి వెళ్తే అందరితో కలివిడిగా కలిసిపోతారు. పాత దోస్తులు, తోటి ఉద్యోగులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లతో పిచ్చాపాటి ముచ్చట్లతో సరదాగా గడిపేస్తుంటారు. అందుకే ఎప్పుడెప్పుడు పార్టీలకు వెళ్తామా అని చాలా మంది ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక పార్టీకి పిలిస్తే చాలు.. టిప్పుటాప్పుగా రెడీ అయ్యి.. బయల్దేరిపోతుంటారు ఇంకొందరు. అయితే.. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పనులు హాస్యాస్పదంగా మారతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ వేడుకలో ఓ వ్యక్తి జాడీలో ఇరుక్కుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అలబామాలోని బర్మింగ్‌హామ్‌కు చెందిన పాడ్జెట్ అనే ఆర్కిటెక్ట్.. మౌంటెన్ బ్రూక్‌ న్యూ ఇయర్ పార్టీకి వెళ్లాడు. కొంత సమయం అందరితో కలివిడిగా కలిసిపోయాడు. ఈ క్రమంలోనే బ్రూక్ అదృశ్యమయ్యాడు. దీంతో బ్రూక్ కోసం అందరూ వెతుకుతుండగా వారికి షాకింగ్ సీన్ కనిపించింది. ఓ పేద్ద ఫ్లవర్ వాస్ లో బ్రూక్ ఇరుక్కుపోవడం చూసి అక్కడున్న వారందరూ కంగారు పడ్డారు. అతనిని ఫ్లవర్ వాస్ నుంచి బయటకు తీసేందుకు ఎంతగానో శ్రమించారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే..క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్స్, షేర్స్ చేస్తున్నారు. అంతే కాకుండా తమకు తోచిన అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 01:14 PM