Share News

Trending News: ఈ జైలుకు వెళ్లడానికి నేరం చేయాల్సిన అవసరం లేదు.. జస్ట్ ప్రేమిస్తే చాలు..!!

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:24 PM

వాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. రోజుకో పేరుతో తో ప్రేమికులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక వాలెంటైన్స్ డే సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Trending News: ఈ జైలుకు వెళ్లడానికి నేరం చేయాల్సిన అవసరం లేదు.. జస్ట్ ప్రేమిస్తే చాలు..!!

వాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. రోజుకో పేరుతో తో ప్రేమికులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక వాలెంటైన్స్ డే సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజున ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని ప్రత్యేకంగా భావించాలని కోరుకుంటారు. విలాసవంతమైన హోటళ్లలో డిన్నర్‌కు వెళ్లడం, కాఫీ కెఫేలకు, ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్తుంటారు. అయితే.. అందరిలా సెలబ్రేట్ చేసుకుంటే వెరైటీ ఏముంటుందని భావించే ప్రేమికులకు యూకే వెరైటీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా జైలులోనే వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ జైలుకు వెళ్లడానికి ఏదైనా నేరం చేయాల్సిన అవసరం లేదు.. జస్ట్ ప్రేమిస్తే చాలు.

యూకేలోని ఓ జైలు (పాత) ప్రేమికుల రోజున ప్రేమపక్షుల కోసం స్పెషల్ ఆఫర్‌ అందించింది. ఇందుకోసం కేవలం 215 డాలర్లు అంటే దాదాపు 17 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రేమికుల కోసం ఆరు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ జైలు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైంది. అక్కడి సెల్ (కారాగారం)లో రాత్రి భోజనం చేసే అవకాశం కల్పించింది.


కాగా.. 1073లో ఈ జైలు భవనం వైద్యశాలగా సేవలందించింది. 1642, 1651 లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా ఈ భవనం చాలా వరకు ధ్వంసమయింది. దీంతో ఈ భవనాన్ని 1785 లో జైలుగా మార్చారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 02:24 PM