Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

AP Elections: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీలో ఫుల్ జోష్!

ABN , Publish Date - Mar 02 , 2024 | 10:12 PM

AP Politics: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా సరే గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వ్యూహ రచనలు చేస్తున్నాయ్. ఇందుకోసం ఏ చిన్నపాటి చాన్స్ వచ్చినా అటు టీడీపీ.. ఇటు వైసీపీ (YSR Congress) వదులుకోవట్లేదు. ఓ వైపు అభ్యర్థులను ప్రకటించి వైసీపీ దూకుడు మీదుంటే.. తగ్గేదేలే అంటూ..

AP Elections: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు.. టీడీపీలో ఫుల్ జోష్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా సరే గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వ్యూహ రచనలు చేస్తున్నాయ్. ఇందుకోసం ఏ చిన్నపాటి చాన్స్ వచ్చినా అటు టీడీపీ.. ఇటు వైసీపీ (YSR Congress) వదులుకోవట్లేదు. ఓ వైపు అభ్యర్థులను ప్రకటించి వైసీపీ దూకుడు మీదుంటే.. తగ్గేదేలే అంటూ ఒకేసారి 99 మంది అభ్యర్థులను ప్రకటించిన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఇంకా చేరికలు.. బీజేపీతో పొత్తు విషయాల లెక్కలు పూర్తిగా తేలకపోవడంతో రెండో జాబితా రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. ఈ గ్యాప్‌లోనే చంద్రబాబు (Chandrababu) మాత్రం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు, పవన్.. అసంతృప్తులు, టికెట్ దక్కని ఆశావహులను నచ్చజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. ఇవన్నీ అటుంచితే.. శనివారం నాడు గుంటూరు జిల్లా దాచేపల్లి బహిరంగ సభ జరిగింది. ఈ సభావేదికగా ఎంపీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించారు.


Telangana: అసదుద్దీన్‌పై మాధవీలత పోటీ.. ఎవరీమె.. బీజేపీ టికెట్ ఎలా దక్కింది..!?


YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?


Lavu-Srikrishna-Devarayalu-.jpg

ఎవరా యంగ్ లీడర్..?

యువ రక్తం రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. ఎంతో మంది యువకులను రాజకీయాల్లోకి తెచ్చిన ఘనత బాబుది. దాచేపల్లి సభలో యంగ్ లీడర్‌ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన మరెవరో కాదు.. వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu). సీఎం వైఎస్ జగన్ రెడ్డి తీరు నచ్చక పార్టీకి గుడ్ బై చెప్పేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక అనంతరం లావును ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ‘ఇవాళే ఇద్దరు ఎంపీలు మన పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వచ్చారు. ఈ ఇద్దరూ టీడీపీలోకి వచ్చింది.. స్వలాభం కోసం కాదు, ప్రజా సేవ కోసం మాత్రమే. లావు శ్రీకృష్ణదేవరాయలును ఎంపీగా పెడతామని సర్వే చేయిస్తే అందరూ అంగీకరించారు. కృష్ణదేవరాయలు ఎన్నికల ముందే గెలిచారు. వైసీపీలో సీటు కావాలంటే డబ్బులు ఇవ్వాలి.. చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను తిట్టాలి. ఈ బాధ భరించలేక వైసీపీ ఎంపీలు టీడీపీలోకి వచ్చారు. దాచేపల్లిలో మీ స్పందన చూస్తే తాడేపల్లి ప్యాలెస్‌కు వణుకు పుడుతోంది. తెలుగుదేశం- జనసేన గెలుపును ఎవ్వరూ ఆపలేరు. అభివృద్ధికి మారుపేరు తెలుగుదేశం.. విధ్వంసానికి చిరునామా వైసీపీ’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?


Lavu-TDP.jpg

అభ్యర్థి సరే.. పోటీ ఎక్కడ్నుంచి..?

ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయులును ప్రకటించిన చంద్రబాబు.. ఎక్కడ్నుంచి బరిలోకి దింపుతారన్నది మాత్రం చెప్పలేదు. అయితే.. పార్టీలో చేరిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 2019 ఎన్నికల్లో యంగ్ లీడర్.. వైసీపీ తరఫున నరసారావుపేట ఎంపీగా పోటీచేసి.. టీడీపీ నుంచి పోటీచేసిన రాయపాటి సాంబశివరావుపై లక్షా యాభై మూడువేల పైచిలుకు మెజార్టీ సాధించారు. అయితే.. ఈసారి కూడా ఇక్కడ్నుంచే టీడీపీ తరఫున పోటీచేస్తారా..? లేకుంటే గుంటూరు నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే.. గతంలో నరసారావుపేట నుంచి పోటీచేసిన రాయపాటి ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తోంది. ఇక గుంటూరు నుంచి అభ్యర్థిని ప్రకటించినప్పటికీ మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణదేవరాయులు పోటీ ఎక్కడ్నుంచి అనేది.. లావు అభిమానులను ఒకింత టెన్షన్ పుట్టిస్తోంది. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.

TDP.gif

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 02 , 2024 | 11:12 PM