Share News

TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:16 PM

Ganta Srinivasa Rao Meeting: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్‌లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..?

TDP: కీలక నేతలతో గంటా శ్రీనివాస్ మీటింగ్.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఎక్కడ్నుంచి పోటీచేస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. మొదటి జాబితాలో పేరు లేకపోవడం.. ఇవాళ రిలీజ్ చేసిన సెకండ్ లిస్ట్‌లోనూ లేకపోవడంతో అసలు గంటా ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తారా.. లేదా..? హైకమాండ్ ఏం చెబుతోంది.. ఈయనేం ఆశిస్తున్నారు..? టీడీపీ (TDP) పెద్దలు గంటాకు ఏం చెప్పారు..? అనే విషయాలు తెలియక క్యాడర్, గంటా వీరాభిమానులు, అనుచరులు ఒకింత ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి గంటా ప్రయత్నాలు చేస్తున్నారు.

Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు..?



Ganta-Sreenivasa-Rao.jpg

అసలేం జరిగింది..?

ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana).. విజయనగరం జిల్లా చీపురుపల్లి (Cheepurupalli) నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాల్సిందేనని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే మాజీ విద్యాశాఖ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావును బొత్సపై పోటీ చేయించాలని భావించింది. అయితే.. ఈ ప్రతిపాదన వచ్చిన గంటల వ్యవధిలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా భేటీ అయ్యారు. తాను చీపురుపల్లి నుంచి పోటీచేయడానికి సుముఖంగా లేనని.. భీమిలి (Bheemili) నుంచే పోటీచేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు గంటా. అయితే.. చీపురుపల్లి అయితే బాగుంటుందని మరోసారి ఆలోచించాలని ఆయనకు హైకమాండ్ చెప్పింది. దీంతో తన సిట్టింగ్ స్థానమైన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్లు చంద్రబాబుకు చెప్పారని తెలిసింది. అయితే.. చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిందేనని మరోసారి హైకమాండ్ గట్టిగా చెప్పడంతో అటో.. ఇటో తేల్చలేక గంటా డైలమాలో పడ్డారట. దీంతో తొలి, రెండో జాబితాలోనూ గంటా పేరు లేకుండా పోయింది. పైగా.. గంటా ఆశిస్తున్న భీమిలి, విశాఖ ఉత్తరం, చీపురుపల్లి నియోజకవర్గాలకు కూడా పెండింగ్‌లో పెట్టాల్సి వచ్చింది.


Ganta-Srinivasa-Rao.jpg

వాట్ నెక్స్ట్..?

సెకండ్ జాబితాలో పేరు లేకపోవడంతో విశాఖ బుుషికొండలో టీడీపీ కీలక నేతలు, కార్యకర్తలతో గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. చీపురుపల్లి నుంచి పోటీచేయాలన్న ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. అయితే తాను భీమిలి నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కార్యకర్తల సాక్షిగా మరోసారి తన మనసులోని మాటను గంటా బయటపెట్టారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ్నుంచి పోటీచేస్తే బాగుంటుంది..? భీమవరం బెస్టా..? లేకుంటే చీపురుపల్లి నుంచే పోటీచేయాల్సిందేనా..? అని కార్యకర్తలు, నేతల నుంచి గంటా అభిప్రాయం తీసుకుంటున్నారు. అభిమానులు, అనుచరుల నుంచి వచ్చే రియాక్షన్‌ను బట్టి భవిష్యత్ కార్యాచరణపై గంటా కీలక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే.. ఓటమెరగని నేతగా పేరుగాంచిన గంటా ఎక్కడ్నుంచి పోటీచేసినా గెలిచి తీరుతారని.. అభిమానులు చెబుతున్నట్లు తెలియవచ్చింది. ఫైనల్‌గా గంటా ఎటు మొగ్గు చూపుతారు..? ఏం తేలుస్తారు..? గంటా ఎటు మోగుతుందా..? అనే దానిపై విశాఖలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 14 , 2024 | 05:21 PM