Share News

YSRCP: గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. తెరపైకి వైఎస్ వీరవిధేయుడు!

ABN , Publish Date - Feb 19 , 2024 | 12:31 PM

Kodali Nani Vs YS Jagan: గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ (Gudivada) నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారా..? ఇందుకు ఇటీవల జరిగిన ఒకట్రెండు పరిణామాలే బలం చేకూరుస్తున్నాయా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది..

YSRCP: గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. తెరపైకి వైఎస్ వీరవిధేయుడు!

గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ (Gudivada) నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారా..? ఇందుకు ఇటీవల జరిగిన ఒకట్రెండు పరిణామాలే బలం చేకూరుస్తున్నాయా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ వైఎస్ జగన్ ప్లానేంటి..? నానీని నిజంగానే పక్కనెడుతున్నారా..? కొడాలిని కాదని జగన్ ఇంకెవర్ని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు..? సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు, నాని వీరాభిమానులు ఏం చర్చించుకుంటున్నారు..? తెరపైకి వచ్చిన కొత్త అభ్యర్థి ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy)లో చూద్దాం..


kodali-nani.jpg

ఇదీ అసలు కథ..

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పటి వరకూ 60పైగా నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించిన జగన్ రెడ్డి.. కొన్ని కీలక జిల్లాలు, నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. ఇందులో కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడ కూడా ఉంది. కొడాలి నానికి టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం.. ఇచ్చి తీరాల్సిందే లేకుంటే వైసీపీ పని అయిపోయినట్టేనని ఇంకో వర్గం.. ఇలా నియోజకవర్గంలో రాజకీయం గందరగోళంగా ఉంది. నానికి తప్ప మరొకరికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆ మధ్య వైసీపీ పెద్దలు కూడా పరోక్షంగా సంకేతాలు పంపినప్పటికీ తాజాగా గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇందులో గుడివాడ పోటీకి దిగుతున్న.. దిగబోతున్న సీనియర్ నేత మండల హన్మంతరావుకు (Mandali Hanumantha Rao) శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఉంది. ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగానూ వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. నాని స్థానంలో హన్మంతరావు అనే పేరు తెరపైకి రావడంతో నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీఎంవో నుంచి హన్మంతరావుకు పిలుపు కూడా వచ్చిందని.. వైసీపీ నేతలు ఫోన్లలో గుసగుసలాడుకుంటున్నారుట. అటు నేతల మాటలు, ఇటు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గుడివాడలో జరుగుతున్న పరిణామాలపైనే అందరి దృష్టి ఉంది.


Mandala-Hanmantha-Rao.jpg

ఎవరీ హన్మంతరావు..?

హన్మంతరావు.. వైసీపీ సీనియర్ నేత. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి టీడీపీ కంచుకోటగా గుడివాడ.. నాటి నుంచి నేటి వరకూ కొడాలి నాని అడ్డాగానే ఉంది. కొడాలి.. టీడీపీలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా సొంత ఇమేజ్‌తో గెలుస్తూ వస్తున్నారన్నది అభిమానులు, అనుచరులు చెబుతున్న మాట. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో పార్టీలు వేరైనప్పటికీ కొడాలి నాని వరుసగా గెలుస్తూ వచ్చారు. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. తిరుగులేని, బలమైన నేతగా పేరు, ప్రఖ్యాతలు గాంచిన.. వీటన్నింటికీ మించి వైఎస్ జగన్‌కు నమ్మినబంటుగా.. అత్యంత ఆప్తుడిగా ఉన్న నానీకి టికెట్ ఇవ్వట్లేదన్న వార్త.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగానే మారింది. దీంతో పాటు సామాజికవర్గం కూడా కొడాలికి పెద్ద ప్లస్ పాయింట్‌గా ఉంది. ఇప్పుడు నానిని కాదని.. హన్మంతరావును వైఎస్ జగన్ నిజంగానే పోటీ చేయిస్తున్నారా.. అంత సాహసం చేస్తారా..? అన్నది పెద్ద ప్రశ్నార్థకంగానే మారింది. ఒకవేళ గుడివాడలో మార్పులు, చేర్పులు జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది సీఎం జగన్‌ రెడ్డికి బాగానే తెలుసు. ఇన్ని తెలిసిన జగన్.. నమ్మినబంటును కాదని.. హన్మంతుడికి టికెట్ ఇస్తారా..? అసలు ఈ ప్రచారంలో నిజమెంత..? ఫ్లెక్సీలు, బ్యానర్లు జస్ట్ ఇలా కట్టడానికే సరిపోతాయా..? లేకుంటే టికెట్ వరకూ వెళ్తాయా..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరి.

Kodali-nani-and-Jagan.jpg

YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?


AP Elections 2024: మంత్రి అంబటికి టికెట్ లేనట్టే.. తమ్ముడి కోసం చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే..!?


Revanth Govt: భట్టీ కీలక ప్రకటన.. మహిళలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్


Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 19 , 2024 | 12:49 PM