Share News

Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!

ABN , Publish Date - Feb 18 , 2024 | 05:26 PM

Raptadu Siddam Sabha: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ (Siddam) పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాయలసీమలో మొదటిసారి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ (Raptadu Siddam Sabha) సభలో ముఖ్యమంత్రికి ఊహించని షాకే తగిలింది.

Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ‘సిద్ధం’ (Siddam) పేరిట భారీ బహిరంగ సభలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన సభలు ఏ మాత్రం సక్సెస్ అయ్యావో.. వైసీపీకి ఎంతవరకూ ప్లస్ అయ్యాయో అందరికీ తెలిసిందే. రాయలసీమలో మొదటిసారి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ (Raptadu Siddam Sabha) సభలో ముఖ్యమంత్రికి ఊహించని షాకే తగిలింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయల్దేరింది మొదలుకుని పుట్టపర్తి ఎయిర్‌పోర్టు దగ్గర దిగి.. సభావేదికకు చేరుకునే వరకూ అడుగడుగునా నిరసన సెగలే తగిలాయి. దీంతో ఇది ఎన్నికల సభా లేకుంటే.. నిరసన సభా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆలస్యమెందుకు.. అసలేం జరిగిందో చూసేద్దాం రండి..


YS-Jagan-Siddham-Sabha.jpg

అటు షాక్‌లు.. ఇటు అవస్థలు.. ఏంటిది సారూ!

  • పుట్టపర్తి ఎయిర్‌పోర్టు దగ్గర సీఎం జగన్ అలా అడుగుపెట్టారో లేదో.. ఎయిర్‌పోర్టు భవనమెక్కి మడకశిర రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిరకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలియజేశారు. ప్లకార్డులతో ఆగలేదు.. ‘గో బ్యాక్ సీఎం.. డౌన్ డౌన్ సీఎం’.. ‘మాకొద్దు జగన్’.. ‘నీళ్లిచ్చి అనంతలో అడుగుపెట్టు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇవన్నీ గమనించిన జగన్ రెడ్డి.. అభివాదం చేస్తూ అక్కడ్నుంచి తిన్నగా జారుకున్నారు. ఇలాంటి ఘటనలు ఒకటా రెండా సభా వేదికకు చేరుకునేంతవరకూ పలు రంగాల వ్యక్తులు, వర్గాల చెందిన ప్రజలు నిరసన గళం వినిపించారు.

  • అనంతలో ఆర్టీసీ ప్రయాణికులు ‘సిద్ధం’ సభ కష్టాలు వచ్చి పడ్డాయి. రాప్తాడు సభకు సుమారు 3వేలకు పైగానే ఆర్టీసీ బస్సులను కేటాయించడం జరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • ఆఖరికి తిరుమల బస్సులను కూడా వదలకుండా రాప్తాడు సభకు తరలించారు వైసీపీ నేతలు. ‘సిద్ధం’ సభకు బస్సులను తరలించడంతో తిరుపతితో పాటు వివిధ బస్ స్టేషన్లలో బస్సుల కోసం గంటల తరబడి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణీకుల పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా భావించి ప్రైవేట్ వాహన యజమానులు నిలువు దోపిడి చేస్తున్నారు. బస్సులు లేకపోవడంతో.. తిరుమల, పీలేరు, చిత్తూరు, కాణిపాకం, మదనపల్లి, నగరి, కడప ఇలా అన్ని రూట్లలోనూ బస్సులు లేక ప్రయాణీకుల అవస్థలు పడుతున్నారు. ఉన్న బస్సులన్నీ జగన్ సభకు బలవంతంగా జనాన్ని తరలించేందుకు ఉపయోగించడంతో బస్సులు లేకపోవడంతో.. జగన్‌ను ప్రయాణికులు తిట్టిపోస్తున్నారు. ‘సభలు నిర్వహించుకోండి.. మాకేంటి ఈ బస్సుల్లేక అవస్థలు’ అంటూ తిరుపతి బస్టాండ్‌లో ప్రయాణికులు కన్నెర్రజేస్తున్నారు. రాయలసీమ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.

  • చూశారుగా.. సిద్ధం సభలకు స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి తెగ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇదిగో ఇదేనండోయ్ ఆ జనాల తరలింపు రహస్యం. రాప్తాడు సభకోసం జనాల తరలింపులో పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. సభా ప్రాంగణం, బస్సుల్లో మద్యం ఏరులైపారింది.

  • 13 గంటలుగా బస్సుల కోసం జనాలు పడిగాపులు కాస్తున్న పరిస్థితి రాయలసీమలోని పలు జిల్లాల్లో ఉందని ప్రయాణికులు చెబుతున్న పరిస్థితి. బస్సుల తరలింపునకు మొత్తం రూ. 10 కోట్లు ఖర్చు అయినట్లు తెలియవచ్చింది. అయితే.. ఆర్టీసీకి మాత్రం కేవలం రూ. 7 కోట్లు మాత్రమే చెల్లించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఆర్టీసీకే నష్టమని సమాచారం. అంటే ఆర్టీసీ అంతా జగన్ సేవలో తరలిస్తోందన్న మాట.

Public.jpg

  • సిద్ధం సభకు జనం తరలించడం.. బస్సులు లేకపోవడం.. ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పోలీసులు, అధికారుల తీరుపై అనంతప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సభ నుంచి వెళ్లిపోతున్న జనాలను జనం జంప్ అవుతుండగా.. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులే రంగంలోకి దిగడం గమనార్హం.

  • మరోవైపు దగ్గరుండి జనాల్ని తరలించాలని వలంటీర్లకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇంటి నుంచి కనీసం ఒకరైనా జగన్ సభకు రావాలని వాలంటీర్లు హుకుం జారీ చేశారట. అంతేకాదు.. సభకు రాకుంటే పథకాలు రద్ధవుతాయని వలంటీర్లు బెదిరిస్తుండటం సిగ్గుచేటు. అంటే వాళ్లు సేవకులు కాదు.. వైసీపీకి పనిచేసే మనుషులని క్లియర్ కట్‌గా అర్థమైపోతోందన్న మాట.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూశారుగా.. వీటన్నింటికీ ఒక్క మాటలో చెప్పాలంటే ‘సిద్ధం’ సభలతో జనానికి సీఎం జగన్ నరకం చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సిద్ధం సభకు వచ్చిన వైఎస్ జగన్‌కు జనం షాకులిస్తుంటే.. సామాన్యులను బలవంతంగా తరలించడానికి బస్సులు తీసుకెళ్లి ప్రయాణికులను ఇబ్బందులు పెడుతున్నారు జగన్. రాయలసీమ వ్యాప్తంగా అన్ని బస్టాండుల్లో ఇదే పరిస్థితి నెలకొందంటే.. ప్రయాణికుల అవస్థలు ఒక్కసారి ఊహించుకోండి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2024 | 05:53 PM