అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో హరీష్‌రావు నిరసన..
ABN, Publish Date - Sep 13 , 2024 | 08:44 AM
రంగారెడ్డి జిల్లా: అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ నేతల తరలింపు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దాదాపు మూడు గంటలపాటు రంగారెడ్డి జిల్లాలో హైడ్రామా నడిచింది. వారిని తొలుత నాటకీయ పరిణామాల మధ్య తలకొండపల్లికి.. అక్కడి నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలంటూ హరీష్ రావు తదితరులు పోలీసు స్టేషన్లోనే బైఠాయించి నిరసన తెలిపారు. వివాదానికి కారకుడైన ఎమ్మెల్యే అరెకపూడిగాంధీపై కేసు పెట్టి అరెస్టు చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు.
1/6
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుతో సహా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం..
2/6
రంగారెడ్డి జిల్లా, కేశంపేట పోలీస్ స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, గంగుల కమలాకరావు తదితరులు..
3/6
కేశంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో మాట్లాడుతున్న హరీష్ రావు..
4/6
మాజీ మంత్రి హరీష్ రావు ఆరెస్టుకు నిరసనగా అర్ధరాత్రి కేశంపేట మండలం, ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో జేసీబీ సహాయంతో పోలీస్ వాహనాన్ని ఆపి నిరసన తెలుపుతున్న స్థానికులు..
5/6
అర్ధరాత్రి కేశంపేట పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు..
6/6
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు..
Updated at - Sep 13 , 2024 | 08:44 AM