కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:54 AM
చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంకు వచ్చారు. అందులో భాగంగా గురువారం కుప్పంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున మహిళలకు ఆర్థిక చూయూత అందిస్తామని తెలిపారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.
1/6
కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించారు.
2/6
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న నారా భువనేశ్వరి..
3/6
కుప్పం నియోజకవర్గంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్న నారా భువనేశ్వరి..
4/6
నారా భువనేశ్వరి.. ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిశీలిస్తున్నారు.
5/6
కుప్పం నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేతలు నారా భువనేశ్వరికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమొంటోను బహుకరించారు.
6/6
ఓ పెద్దాయిన ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న నారా భువనేశ్వరి..
Updated at - Dec 20 , 2024 | 11:54 AM