78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Aug 15 , 2024 | 12:06 PM
విజయవాడ: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వైద్య, ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు నాటి పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించామని అన్నారు.
1/6
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
2/6
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
3/6
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పోలీసుల గౌరవాన్ని స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు..
4/6
విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ
5/6
కాకినాడ కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
6/6
గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్..
Updated at - Aug 15 , 2024 | 12:06 PM