TDP: పలమనేరు, పుత్తూరులో చంద్రబాబు ‘ ప్రజాగళం’
ABN, Publish Date - Mar 28 , 2024 | 08:00 AM
చిత్తూరు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రజాగళం యాత్రను ప్రారంభించారు. తొలిరోజు చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్నటి వరకు పరదాల చాటున పర్యటనలు సాగించిన ముసుగువీరుడు జగన్.. ఇప్పుడు మొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటి జనాల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రచారానికి వస్తున్న ఆయనకు ఖాళీ రోడ్లతో, ఖాళీ ఇళ్లతో స్వాగతం పలకాలని పిలుపిచ్చారు. ‘జగన్‌కు స్వాగతం పలికినా, మద్దతు తెలిపినా మీకు మీరు అన్యాయం చేసుకున్నట్లేనని’ అన్నారు.
1/6
చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, పుత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు విక్టరీ సంకేతం చూపుతున్న చంద్రబాబు..
2/6
నగరి నియోజకవర్గం, పుత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.
3/6
చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, పుత్తూరులో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు..
4/6
చిత్తూరు జిల్లా, పలమనేరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అభివాదం తెలుపుతున్న చంద్రన్న..
5/6
పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం.
6/6
పలమనేరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం బహిరంగ సభకు హాజరైన జనం...
Updated at - Mar 28 , 2024 | 08:00 AM