TDP: రాయచోటి, కడపలో చంద్రబాబు ప్రజాగళం
ABN, Publish Date - May 03 , 2024 | 11:56 AM
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు.. ముఖ్యమంత్రి జగన్‌పై ఈ ఐదు ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ఆయనకు ఓటడిగే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ప్రజాగళంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో, కడప జిల్లా కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం అమలు చేయలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో రూ.60 ఉన్న మద్యం ఇప్పుడు రూ.200 అయిందని.. పెరిగిన రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు. తాము దమ్మున్న ప్రజా మేనిఫెస్టో తెచ్చామని.. దాని ముందు జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందని చంద్రబాబు అన్నారు.
1/8
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా, రాయచోటి ప్రజాగళం సభలో ప్రసంగించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
2/8
ముఖ్యమంత్రి జగన్‌పై ఐదు ప్రశ్నలతో విరుచుకుపడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. దీనిపై కరపత్రం చూపుతున్న దృశ్యం.
3/8
అన్నమయ్య జిల్లా, రాయచోటిలో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
4/8
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాత్రి కడప జిల్లా కేంద్రానికి ర్యాలీగా వస్తూ.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.
5/8
కడప జిల్లా కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.
6/8
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కడప జిల్లా కేంద్రంలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తున్న టీడీపీ కూటమి అభ్యర్థి మాదవీ రెడ్డి
7/8
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కడప జిల్లా కేంద్రానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక నేతలు భారీ గజమాలతో సన్మానిస్తున్న దృశ్యం.
8/8
కడప జిల్లా కేంద్రంలో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు..
Updated at - May 03 , 2024 | 11:56 AM