Share News

TANA: తానా కమిటీకి చైరపర్సన్‌ల నియామకం..

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:41 PM

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గురువారం తెలిపారు.

TANA: తానా కమిటీకి చైరపర్సన్‌ల నియామకం..

న్యూయార్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)లో కీలకమైన వివిధ విభాగాలకు చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి గురువారం తెలిపారు. తానాలో ముఖ్యమైన టీమ్‌ స్క్వేర్‌ కమిటీకి చైర్‌ పర్సన్‌గా కిరణ్‌ కొత్తపల్లిని నియమించారు.


Mumbai: హైదరాబాద్ హలీమ్‌కు సచిన్ టెండూల్కర్ ఫిదా..

తానా పత్రిక చైర్‌ పర్సన్‌గా సాయి బ్రహ్మానందం గొర్తి, వెబ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా బిల్హన్‌ ఆలపాటి, కళాశాల చైర్‌ పర్సన్‌గా మాలతి నాగభైరవ, పాఠశాల చైర్‌ పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌ షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యులుగా సుధీర్‌ చింతమనేని, శ్రీనివాస్‌ వల్లూరిపల్లిని నియమించినట్లు రాజా కసుకుర్తి తెలిపారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 12:41 PM