Share News

Tips for Happiness: లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలా? అయితే ఇవి పాటించాల్సిందే..!

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:53 PM

Lifestyle: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, ఎలాంటి టెన్షన్‌లు లేకుండా హ్యాపీగా జీవించాలని(Happy Life) కోరుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్‌లో అది సాధ్యమయ్యే పనికాదని అందరికీ తెలుసు. పని ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు కారణంగా చాలా మంది తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. డిప్రెషన్‌కు(Depression) లోనవుతారు. ఇది వ్యక్తి మానసిక స్థితిని పాడుచేయడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Tips for Happiness: లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలా? అయితే ఇవి పాటించాల్సిందే..!
Tips for Happiness

Lifestyle: ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని, ఎలాంటి టెన్షన్‌లు లేకుండా హ్యాపీగా జీవించాలని(Happy Life) కోరుకుంటారు. కానీ నేటి బిజీ లైఫ్‌లో అది సాధ్యమయ్యే పనికాదని అందరికీ తెలుసు. పని ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు కారణంగా చాలా మంది తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. డిప్రెషన్‌కు(Depression) లోనవుతారు. ఇది వ్యక్తి మానసిక స్థితిని పాడుచేయడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన, కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండవచ్చు. మరి సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

సంతోషంగా ఉండటానికి ఈ అలవాట్లు అలవర్చుకోండి..

ఇతరులతో పోల్చుకోవద్దు: సంతోషంగా ఉండటానికి సులభమైన మార్గం మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయడం. కొందరైతే ప్రతి చిన్న విషయంలోనూ ఇతరులతో పోల్చుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ అలవాటు మీమ్మల్ని మరింత బాధ కలిగిస్తుంది. అందుకే.. సంతోషంగా ఉండాలనుకుంటే మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.

మీ కోసం కొంత సమయం: నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో మీరు సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజూ కొంత సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకోవాలి. మీతో మీరు సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. ఏకాంతంలో కొంత సమయం గడపడం వల్ల మనసుకు రిలాక్స్‌, ఆనందం కలుగుతుంది.

చెడు విషయాలను మర్చిపోవడం: కొందరు తమను ఎవరైనా తిట్టినప్పుడు లేదా కొన్ని చెడు విషయాలు జరిగినప్పుడు దానిని తమ మనస్సులో ఉంచుకుంటారు. దాని గురించి పదేపదే ఆలోచిస్తారు. తద్వారా తమలో తాము బాధ పడుతుంటారు. దీనివల్ల మనశ్శాంతిని కోల్పోతారు. అందుకే.. మీరు జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. మీ మనస్సుపై ప్రతికూల ప్రభావం చూపే విషయాలను మర్చిపోవడం అలవాటు చేసుకోవాలి.

సానుకూల దృక్పథం: సంతోషంగా ఉండాలంటే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటం ముఖ్యం. మీరు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే.. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. సమస్యకు భయపడకుండా.. సమస్యతో జీవించడం నేర్చుకోవాలి. తద్వారా ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే మనోధైర్యం ఏర్పడుతుంది. సంతోషంగా ఉంటారు.

ఇతరుల నుంచి ఆశించొద్దు: ‘ఎక్స్‌పెక్టేషన్‌ ఆల్వేస్‌ హర్ట్‌’ అని ఒక నానుడి ఉంది. ఇతరుల నుండి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించినట్లయితే.. అది మనల్ని ఖచ్చితంగా బాధిస్తుంది. అందుకే ఎవరి నుండి ఏమీ ఆశించొద్దు.

సంగీతం వినండి: ప్రతిరోజూ మీకు నచ్చిన సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. సంగీతం అలసటను తగ్గిస్తుంది. ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచడం ద్వారా మీకు సంతోషాన్నిస్తుంది. ఇది మీ మనస్సును కూడా రిఫ్రెష్ చేస్తుంది. ఇంటి పనులు చేసుకుంటూ సంగీతం వినవచ్చు.

అలాగే మీరు 8 గంటల మంచి నిద్ర, పుస్తకాలు చదవడం, వ్యాయామాలు చేయడం, నిశ్శబ్ద ప్రదేశంలో కొద్దిసేపు నడవడం ద్వారా మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 12:53 PM