Share News

Constipation: మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి తాగండి..

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:30 AM

Juice for Constipation Issues: ఒక్కోసారి చిన్న చిన్న అంశాలే మన ఆరోగ్యాన్ని(Health) తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి సాధారణ సమస్యల్లో మలబద్ధకం(Constipation) ఒకటి. వారానికి మూడుసార్ల కంటే తక్కువ మల విసర్జన జరిగితే.. దానిని మలబద్ధకం అంటారు. మల విసర్జన సమయంలో రక్తం వస్తున్నట్లయితే.. మలబద్ధకం సమస్య తీవ్రమైనట్లుగా వైద్యులు పరిగణిస్తారు. బాధితుల్లో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది.

Constipation: మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి తాగండి..
Constipation Issues

Juice for Constipation Issues: ఒక్కోసారి చిన్న చిన్న అంశాలే మన ఆరోగ్యాన్ని(Health) తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి సాధారణ సమస్యల్లో మలబద్ధకం(Constipation) ఒకటి. వారానికి మూడుసార్ల కంటే తక్కువ మల విసర్జన జరిగితే.. దానిని మలబద్ధకం అంటారు. మల విసర్జన సమయంలో రక్తం వస్తున్నట్లయితే.. మలబద్ధకం సమస్య తీవ్రమైనట్లుగా వైద్యులు పరిగణిస్తారు. బాధితుల్లో తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. అయితే, ఈ సమస్య నుంచి బయటపడేందుకు వంటింటి చిట్కాలు(Home Remedies) బోలెడు ఉన్నాయి. వాటి ద్వారా మలబద్ధకం సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. మలబద్ధకం సమస్య తగ్గడానికి కొన్ని జ్యూస్‌లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ జ్యూస్‌లు ఏంటో ఓసారి చూద్దాం..

అలోవెరా(కలబంద) జ్యూస్..

అలోవెరా (కలబంద) జ్యూస్ తాగడగం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగుల కదలికలు మెరుగవుతాయి. అందుకే.. అలోవెరా జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తుంటారు.

ఆపిల్ జ్యూస్..

ఆపిల్‌లో సార్బిటాల్ ఉంటుంది. అయితే, కొద్ది మోతాదులోనే ఉన్నప్పటికీ.. మలబద్ధకం సమస్యకు పరిష్కారం చూపుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఆపిల్ జ్యూస్ తాగితే మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరెంజ్ జ్యూస్..

ఆరెంజ్‌లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. ఇది పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. ఈ సిట్రస్ పండులో నరింగెనిన్ అనే ఫ్లేవనాల్ కూడా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

పాలకూర జ్యూస్..

పాలకూర జ్యూస్ మలబద్ధకం సమస్యకు మంచి పరిష్కారం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పాలకూర జ్యూస్ తాగినా.. వంటకాల్లో తిన్నా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

పియర్ జ్యూస్..

పియర్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు.. సహజ భేదిమందులా పని చేస్తుంది. ఇందులో అధిక ఫ్రక్టోజ్ కంటెంట్, సార్బిటాల్‌ ఉంటుంది. పియర్ జ్యూస్ తాగడం వల్ల పేగుల కదలిక మెరుగుపడుతుంది. మలం మృదువుగా, సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుంది.

నిమ్మరసం..

ప్రేగు కదలికలను మెరుగుపరచడానికి, పేగులను శుభ్రపరచడానికి నిమ్మరసం ఒక అద్భుతమైన మార్గం. నిద్రపోయే ముందు, మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది.

ద్రాక్ష జ్యూస్..

ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో ఇది సహాయ పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 11:30 AM