Share News

Trending News: రైలులో పురిటి నొప్పులు.. ప్రసవం.. శిశువుకు ఏ పేరు పెట్టారంటే..

ABN , Publish Date - Mar 23 , 2024 | 05:51 PM

సుదూర ప్రయాణాలు చేయడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఇక గర్భిణీలు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ప్రయాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం తప్పదు.

Trending News: రైలులో పురిటి నొప్పులు.. ప్రసవం.. శిశువుకు ఏ పేరు పెట్టారంటే..

సుదూర ప్రయాణాలు చేయడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఇక గర్భిణీలు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ప్రయాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం తప్పదు. తాజాగా మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) లో ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన మహిళ గర్భవతి. తన భర్తతో కలిసి నాసిక్ నుంచి మధ్యప్రదేశ్ లోని సత్నాకు వెళ్లేందుకు ముంబయి-వారణాసి కామయాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. రాను రాను ఎక్కువ అవుతుండటంతో అదే కోచ్ లో ఉన్న ఇద్దరు మహిళలు ప్రసవం చేశారు. భోపాల్- విదిశా రూట్ లో ఈ ఘటన జరిగిందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మంజు మహోబే తెలిపారు.

Trending Video: రొమాంటిక్ సాంగ్.. రంగులతో హల్చల్.. దిల్లీ మెట్రోలో యువతుల రచ్చ..

పురిటి నొప్పులు ఎక్కువ అయిన సమయంలో ఓ వ్యక్తి విషయాన్ని ఆర్‌పీఎఫ్‌ కు తెలిపారు. రైలు విదిశా రైల్వే స్టేషన్‌కు వెళ్లాక తల్లీబిడ్డలనూ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అయితే.. కామయాని ఎక్స్‌ప్రెస్ రైలులో జన్మించిన శిశువుకు రైలు పేరు అయిన కామయాని పేరు పెట్టడం విశేషం.

Kejriwal : కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు పంపండి.. శిక్ష పడేలా చేస్తా.. సుకేశ్ సంచలన ప్రకటన..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 05:51 PM