Share News

WhatsApp Message: వివాదంగా మారిన మోదీ ప్రభుత్వం వాట్సాప్ మెసేజ్

ABN , Publish Date - Mar 17 , 2024 | 12:34 PM

ఈసారి కూడా మోదీ ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇటివల ప్రజలకు చేరువ కావడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివల పంపించిన వాట్సాప్ సందేశాలు వివాదాస్పదంగా మారాయి.

WhatsApp Message: వివాదంగా మారిన మోదీ ప్రభుత్వం వాట్సాప్ మెసేజ్

ఈసారి కూడా మోదీ ప్రభుత్వం(Modi government) భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ(BJP) ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇటివల ప్రజలకు చేరువ కావడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలను ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ప్రభుత్వం వాట్సాప్‌లో ప్రజలకు సందేశం(WhatsApp message) పంపినట్లు వెలుగులోకి వచ్చింది. హలో ఈ లేఖను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వ అభివృద్ధి చెందిన ఇండియా కాంటాక్ట్ సెంటర్ పంపింది.

గత 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల కంటే ఎక్కువ మంది పౌరులు భారత ప్రభుత్వ పథకాల నుంచి ప్రత్యక్షంగా లబ్ది పొందారు. భవిష్యత్తులో కూడా వాటి నుంచి ప్రయోజనం పొందుతారు. అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు, సూచనలు చాలా అవసరమని వచ్చిన మెసేజులో ఉంది. అంతేకాదు దీనిపై మీ అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. అయితే విక్షిత్ భారత్ సంపర్క్ నుంచి వచ్చిన వాట్సాప్ సందేశం(WhatsApp message) ఇప్పుడు వివాదంగా మారింది.


బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారం కోసం ప్రజలకు సందేశాలు పంపిస్తూ ప్రభుత్వ డేటాను దుర్వినియోగం చేస్తున్నారని కేరళ(kerala)లోని కాంగ్రెస్(congress) రాష్ట్ర యూనిట్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీడ్‌బ్యాక్ ముసుగులో రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ఎన్నికల కోడ్ రాకముందే ఈ సందేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలా సందేశాలు పంపిస్తారని అంటున్నారు. మీ బీజేపీ(bjp) పార్టీ తరఫున పంపించుకోవాలని అంటున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Dhanashree Verma: నేను మీ అమ్మా, చెల్లి అని మరువకండి.. ట్రోలర్లపై ధనశ్రీ వర్మ ఆగ్రహం

Updated Date - Mar 17 , 2024 | 12:34 PM