Share News

Dhanashree Verma: నేను మీ అమ్మా, చెల్లి అని మరువకండి.. ట్రోలర్లపై ధనశ్రీ వర్మ ఆగ్రహం

ABN , Publish Date - Mar 17 , 2024 | 10:23 AM

భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతని భార్య ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ ఇటివల ధనశ్రీ వర్మ(Dhanashree Verma) పోస్ట్ చేసిన ఓ చిత్రంపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్(trolls) చేస్తున్నారు. దీనిపై తాజాగా ధనశ్రీ వర్మ స్పందించారు.

Dhanashree Verma: నేను మీ అమ్మా, చెల్లి అని మరువకండి.. ట్రోలర్లపై ధనశ్రీ వర్మ ఆగ్రహం

భారత జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal), అతని భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరూ తరచూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ కనిపిస్తుంటారు. ప్రముఖ డ్యాన్సర్ ధనశ్రీ ఇటీవల ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో కూడా పాల్గొంది. ఆ సమయంలో ఆమె తన కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియా(social media)లో పంచుకున్నారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ఆ చిత్రం చూసిన అనేక మంది నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్ల నేపథ్యంలో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ ధనశ్రీ(Dhanashree Verma) ధీటుగా సమాధానం ఇచ్చింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసి ట్రోలర్లకు అన్సార్ చేసింది. ట్రోల్స్ కారణంగా తన ఫ్యామిలీ(family) ప్రభావితమవుతుందని చెప్పింది. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం విరామం ఇస్తున్నానని ధనశ్రీ తెలిపింది. ఈ క్రమంలో నేను నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్స్‌, మీమ్స్‌ బారిన పడలేదు. కానీ ఈసారి అది నన్ను, నా కుటుంబాన్ని ప్రభావితం చేసింది. దీని గురించి మీకు ఎలా అనిపిస్తుంది? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి మీ అందరికీ స్వేచ్ఛ ఉంది. కానీ అది ఒక కుటుంబంపై ప్రభావం చూపుతుందని మీరు మర్చిపోతున్నారని తెలిపింది.


ఈ వీడియో ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారు తమ ప్రతిభ, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించింది. అంతేకాదు తాను కూడా మీ తల్లి(mother), సోదరి(sister) లాంటి మహిళనే అనే విషయాన్ని ట్రోలర్లు(trollers) గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. మీ అక్క, స్నేహితురాలు, భార్య అందరూ కూడా స్త్రీలు అనే విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికింది. ధనశ్రీ 2014లో నవీ ముంబైలోని DY పాటిల్ కాలేజీ నుంచి డెంటిస్ట్రీ చదివింది. అయితే ఆమె డాక్టర్ కాకుండా ఫిట్‌నెస్ ట్రైనర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో ధనశ్రీ వర్మ, చాహల్ 2020లో వివాహం చేసుకున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Donald Trump: నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోకపోతే రక్తపాతం తప్పదు

Updated Date - Mar 17 , 2024 | 10:34 AM