Share News

Trending: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అప్పటి నుంచే.. 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగిందంటే..

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:13 PM

సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్ కు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు.

Trending: వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అప్పటి నుంచే.. 41 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగిందంటే..

సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్ కు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు ( Elections ) జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకేసారి జమిలీ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. అయితే ఈ జమిలీ ఆలోచన ఇప్పటిదీ కాదండోయ్. సుమారు 41 ఏళ్ల క్రితమే అంటే 1983లోనే ఈ విధానంలో ఎన్నికలు జరపాలని నాటి ఎన్నికల సంఘం నిర్ణయించడం గమనార్హం.

వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందించారు. 18 వేల పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్లకు ఒకే ఓటరు జాబితా సిద్ధం చేయాలని నివేదికలో సూచించారు. 2023, సెప్టెంబర్ 2 న ఏర్పాటైన ఈ కమిటీ నివేదికను రూపొందించడానికి 191 రోజులు పట్టింది. ఈ కమిటీ ఏ విధంగా ముందుకు సాగిందో, కాలక్రమేణా అందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం.


1983లో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ఎన్నికల సంఘం సూచించింది. 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణలపై తన 170వ నివేదికను సమర్పించింది. 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా జమిలీ ఎన్నికలపై నివేదికను విడుదల చేశారు. 15 ఆగస్టు 2019 నాటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశం అంతటా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో 1 సెప్టెంబర్ 2023న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 'ఒక దేశం, ఒకే ఎన్నిక'పై కమిటీ ఏర్పాటయ్యింది.

2 సెప్టెంబర్ 2023న కమిటీ సభ్యులను ప్రకటించారు, హోం మంత్రితో సహా 7 మంది సభ్యులను నియమించారు. 23 సెప్టెంబర్ 2023న కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ అంశంపై ముందుగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రోడ్‌మ్యాప్‌కు సంబంధించి లా కమిషన్‌తో చర్చించి ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. 14 మార్చి 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కమిటీ నివేదిక సమర్పించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 05:18 PM