Share News

GSLV: శ్రీహరికోట వేదికగా మరో ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 శాటిలైట్‌..

ABN , Publish Date - Feb 17 , 2024 | 05:50 PM

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జరిపిన GSLV F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా 5.35 గంటలకి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.

GSLV: శ్రీహరికోట వేదికగా మరో ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 శాటిలైట్‌..

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి జరిపిన GSLV F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సరిగ్గా 5.35 గంటలకి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్18 నుంచి 19 నిమిషాల ప్రయాణం చేయనుంది. ఇన్ శాడ్ త్రీడీఎస్ శాటిలైట్ ని మోసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని భూమికి 253.53 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వాతావరణ అధ్యయనానికి సంబంధించిన GSLV-F14 శాటిలైట్‌ను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఇన్‌శాట్ 3డీఎస్ ఉప‌గ్రహాన్ని కక్ష్యలోకి పంపించారు. ఈ ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 2గంటల 5నిమిషాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది రెండో ప్రయోగం రెండో వేదిక నుంచి జరగడం ఆసక్తిగా మారింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 06:03 PM