Share News

Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ.. తమిళ్ మానిలా కాంగ్రెస్ కీలక ప్రకటన..

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:20 PM

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Tamil Nadu: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ.. తమిళ్ మానిలా కాంగ్రెస్ కీలక ప్రకటన..

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీ అధినేత జీకే.వాసన్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 27న తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవుతున్నట్లు వివరించారు. దివంగత నేత జీకే మూపనార్ తమిళ మానిలా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి తమ పార్టీ జాతీయ దృక్పథాన్ని కలిగి ఉంది. బీజేపీతో కలవాలనే నిర్ణయం తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మాత్రమేనని జీకే వాసన్ వివరించారు.

గతంలో జరిగిన రెండు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ప్రధాన మంత్రిగా రెండు సార్లు నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయం తమిళ ప్రజలందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల మద్దతుతో బీజేపీ గెలుపొందింది. దేశ ఆర్థికాభివృద్ధికి, పేదల అభ్యున్నతికి భరోసా ఇస్తున్న కమలం పార్టీ గెలుపునకు తమిళ ఓటర్లు అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. పేదరికం తగ్గుతుందని జీకే వాసన్ పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 01:20 PM