Share News

PM Narendra Modi: ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:49 PM

లోక్‌సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

PM Narendra Modi: ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తన కార్యాలయాన్ని ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆరోపించారు. బీజేపీ కోసం ఓట్లు అడిగేందుకు ప్రధాని మోదీ ప్రజా వనరుల్ని వినియోగిస్తే.. ఆ ఖర్చులకు సంబంధించిన బిల్లులను బీజేపీకి పంపాలని ఆయన ఎన్నికల సంఘాన్ని (Election Commission Of India) కోరారు. బీజేపీ ఖాతా నుంచి డబ్బులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు


‘‘ప్రధాన మోదీ తన ప్రయాణాలకు ప్రభుత్వ విమానాన్ని ఉపయోగిస్తుంటే.. ఎన్నికల సంఘం బీజేపీకి ఖర్చుల బిల్లును పంపించి, ఆ పార్టీ ఖాతా నుంచి డబ్బులు రికవరీ చేయాలి. ఎన్నికలను ప్రకటించిన తర్వాత ప్రధాని కొన్ని రోజుల నుంచి ప్రభుత్వ హెలికాప్టర్లలో తిరుగుతున్నారు’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఇదే సమయంలో.. ప్రధాని ముంబై పర్యటనని సైతం టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. అదానికి (Adani) భూమి ఇవ్వడం కోసమే మోదీ నగరానికి వచ్చారని ఆరోపించారు. ‘‘ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ గౌతమ్ అదానీకి ఇవ్వబడింది. అయితే.. ముంబై నుంచి బీజేపీని పూర్తిగా తరిమికొట్టాలని స్థానిక ప్రజలు నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ముంబైలో పది మీటింగ్స్ నిర్వహించినా, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. నా మాటలని రాసి పెట్టుకోండి’’ అని సంజయ్ రౌత్ ఉద్ఘాటించారు.

YS Sharmila: సీఎం జగన్ నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఈ వ్యాఖ్యలకు ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ (Ashish Shelar) కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని అన్నారు. తమ పెద్దలను అగౌరవపరచమని మరాఠీ సంస్కృతి ఎప్పుడూ నేర్పించదని చెప్పారు. సంజయ్ రౌత్‌కు ప్రాథమిక పౌర జ్ఞానం లేదని, అతని కోసం తాము పౌర పుస్తకాలను పంపుతామని సెటైర్లు వేశారు. ప్రవర్తనా నియమావళి సమయంలో కూడా.. ఉన్నత పదవుల్లో ఉన్నవారు తమ విధుల్ని తప్పనిసరిగా నిర్వర్తించాలని చెప్పారు. ఆర్‌బీఐ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరైనప్పుడు.. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదని ఆశిష్ గుర్తు చేశారు.

Updated Date - Apr 02 , 2024 | 05:51 PM