Share News

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు

ABN , Publish Date - Apr 02 , 2024 | 03:33 PM

జగన్ సర్కార్ పుణ్యమా అని.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నెత్తిన రికార్డ్ స్థాయిలో అప్పు ఉంది. రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి, పథకాల రూపంలో డబ్బు పంచడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీని అప్పుల దిబ్బగా మార్చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో నాలుగు వేల కోట్లు అప్పు చేసింది.

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు

జగన్ సర్కార్ (YS Jagan) పుణ్యమా అని.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెత్తిన రికార్డ్ స్థాయిలో అప్పు ఉంది. రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి, పథకాల రూపంలో డబ్బు పంచడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీని అప్పుల దిబ్బగా మార్చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో నాలుగు వేల కోట్లు అప్పు చేసింది. పెన్షన్ల (Pensions) పంపిణీ కోసం నిధులు లేకపోవడంతో.. ఆర్బీఐ (RBI) తలుపు తట్టింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే జగన్ సర్కార్ అప్పులతో ఖాతా తెరిచిందంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..


రూ.1000 కోట్లను 7.46 శాతం వడ్డీతో 17 సంవత్సరాలకు ఏపీ సర్కారు రుణం తెచ్చింది. మరో రూ.1000 కోట్ల మొత్తాన్ని 7.46 శాతం వడ్డీతో 19 సంవత్సారాలకు గాను, ఇంకో రూ.1000 కోట్లు 7.46 శాతం వడ్డీతో 20 సంవత్సరాలకు రుణం అప్పు చేసింది. అలాగే.. రూ.500 కోట్లు 7.39 శాతం వడ్డీతో 6 సంవత్సరాలకు, మిగిలిన రూ.500 కోట్లు 7.46 శాతంతో 18 సంవత్సరాలకు గాను అప్పు తీసుకుంది. ఈ అప్పుతో.. దేశంలోనే అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా ఏపీ చరిత్రపుటలకెక్కింది. ఈ అప్పు పుట్టిన నేపథ్యంలో.. మంగళవారం సాయంత్రమే నిధులు డ్రా చేసి, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌లకు ప్రభుత్వం పంపనుంది. బుధవారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది.

Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!

నిజానికి.. పెన్షన్లు పంపిణీ చేసేందుకు గాను జగన్ సర్కార్ ఖజానాలో ఇంతకుముందు నిధులు లేవు. అయినప్పటికీ.. ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్లు ఇస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. బ్లూ మీడియాలో కూడా ఈ అంశాన్ని ప్రసారం చేసింది. అందుకోసమే.. ఆఘమేఘాల మీద ఆర్బీఐ వద్దకు వెళ్లి, జగన్ సర్కార్ ఈ అప్పు తీసుకొచ్చింది. వాలంటీర్ల సహకారంతో ఈ పెన్షన్లను పంపిణీ చేద్దామని ప్రయత్నించింది కానీ, వారిని తొలగించడంతో కూటమి పక్షాలపై ఆ నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నించింది. అయితే.. ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో తాము పెన్షన్ పంపిణీ చేస్తామని వాయిస్ మెసేజ్‌ల రూపంలో భరోసా కల్పించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 03:36 PM