Share News

YS Sharmila: సీఎం జగన్ నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:01 PM

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అనుకున్న వాళ్లందరినీ సీఎం జగన్ నాశనం చేశాడని, హత్యా రాజకీయాలను ప్రోత్సాహించాడని కుండబద్దలు కొట్టారు.

YS Sharmila: సీఎం జగన్ నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అనుకున్న వాళ్లందరినీ సీఎం జగన్ నాశనం చేశాడని, హత్యా రాజకీయాలను ప్రోత్సాహించాడని కుండబద్దలు కొట్టారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress) అధిష్ఠానం తొలి అభ్యర్థుల జాబితాను (Congress First List) విడుదల చేసిన కొద్దిసేపటి తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నానని, ఈ నిర్ణయం తనకు సులువైంది కాదని అన్నారు. ఈ నిర్ణయం తన కుటుంబాన్ని చీలుస్తుందని, వైఎస్సార్ అభిమానుల్ని గందరగోళంలో పడేలా చేస్తుందని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో కడప ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాల్సి వస్తోందని చెప్పారు.

AP Election 2024: భారత ఎన్నికల సంఘానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ

జగన్ మోహన్ రెడ్డి తన అన్న అని, ఆయనంటే తనకు ద్వేషం లేదని, గత ఎన్నికల సమయంలో తనని చెల్లే కాదు బిడ్డ అని పిలిచాడని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కానీ.. సీఎం అయ్యాక జగన్ మారిపోయాడని, ఇప్పుడున్న జగన్ తనకు పరిచయడం లేడని బాంబ్ పేల్చారు. వివేకాను హత్య చేసిన వారికే కడపలో ఎంపీ అభ్యర్థిగా సీట్ ఇచ్చాడని, ఇది తెలిసి తాను తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష విధించలేదని.. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు తప్పించుకొని తిరుగుతున్నారని ఉద్ఘాటించారు. అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అధికారం వాడుకొని, జగనే వాళ్లని రక్షిస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడని, మళ్లీ అతనికే సీట్ ఇచ్చాడని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని, వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని, ఈ విషయం తమకు చాలా ఆలస్యంగా అర్థం అయ్యిందని పేర్కొన్నారు. సాక్షి ఛానెల్ తప్పుడు కథనాలు ప్రసారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు


వైఎస్సార్, వివేకా రామ-లక్ష్మణుడిలా ఉండేవాళ్లని.. తనని ఎంపీగా చూడాలన్నదే వివేకా (YS Viveka) ఆఖరి కోరిక అని షర్మిల పేర్కొన్నారు. తనని ఎంపీగా ఉండమని ఎందుకు అడిగారో ఆనాడు అర్థం కాలేదని, ఇవాళ అర్థం అయ్యిందని చెప్పారు. న్యాయం కోసం సునీత గడప గడపకు తిరుగుతున్నారని, న్యాయం కోసం ఆమె ఎక్కని మెట్టు లేదని అన్నారు. తాను హత్యా రాజకీయాలకు పూర్తి విరుద్ధమని పునరుద్ఘాటించారు. ఒక హంతకుడు పార్లమెంట్ మెట్టు ఎక్కకూడదనే తాను కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని వివరణ ఇచ్చారు. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారని.. రాజన్న రాజ్యమని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడని తూర్పారపట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడని కడిగిపారేశారు. మద్యం ఏరులై పాలించాడని నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఘాట్ వద్ద నివాళులు అర్పించి, వారి ఆశీస్సులు తీసుకున్నామన్నారు. వైఎస్సార్.. కాంగ్రెస్ పార్టీ నాయకుడని, కాంగ్రెస్ తరఫున 10 ఎన్నికల్లో గెలిచారని, పదవులు లేకున్నా పార్టీలో నిలబడ్డాడని అన్నారు.

AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?

ఏపీలో కాంగ్రెస్‌ను వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఏర్పాటుకు తనవంతు సహకారం ఇచ్చారని షర్మిల తెలిపారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని అయ్యే వారని, వైఎస్సార్ కల నెరవేరేదని అభిప్రాయపడ్డారు. తన తండ్రి ఆశయం కోసం తాను ఇవాళ పార్టీలో చేరానని, కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. మంగళవారం 5 మంది ఎంపీలు,114 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశామని.. మరో రెండు, మూడు రోజుల్లో తుది జాబితా విడుదల అవుతుందని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఏనాడూ పని చేయలేదని, ఒక్క ఉద్యమం కూడా చేయలేదని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదన్న ఆమె.. రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉందన్నారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 05:04 PM