Share News

AP Election 2024: భారత ఎన్నికల సంఘానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:05 PM

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.

AP Election 2024: భారత ఎన్నికల సంఘానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) భారత ఎన్నికల సంఘానికి కీలక లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. పెన్షన్లను ఇంటింటికీ పంపించకుండా సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి టీడీపీ అధినేత తీసుకెళ్లారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని, ఇంటి వద్దే పింఛను అందించే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

లేఖలోని అంశాలు ఇవే..

‘‘ ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛనుదారుల ఇంటి వద్దకే పింఛన్‌లు అందజేసే విధానం కొనసాగుతోంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు, ఇతర నగదు బదిలీ పంపిణీని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దనే పెన్షన్ల పంపిణీ జరిపేలా సెర్ప్ సీఈవో ఆదేశాలు ఇచ్చారు. లబ్దిదారులను ఇబ్బందిపెట్టే ఈ ఆదేశాలలో కుట్ర దాగి ఉంది. ఇంటింటికి పెన్షన్లు అందకపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణం అని మాకు ఆపాదిస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందించే చర్యలు తీసుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాను. ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్లు కూడా దీనికి అంగీకరించారు’’.


AP MLC: అనంతబాబుకు చుక్కలు చూపించిన దళితులు

‘‘ రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఇతర గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా లబ్దిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే పెన్షన్ల పంపిణీకి నోడల్ ఆఫీసర్‌గా ఉండే సెర్ప్ సీఈవో దీనికి అభ్యంతరాలు చెపుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సెర్ప్ సీఈవో డీ.మురళీధర్ రెడ్డి బంధువు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కేసుల్లో కూడా సహ నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల వేళ తెలుగుదేశంపై బురద జల్లడం కోసం ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయవద్దని వైసీపీ ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై రాజకీయ ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 40 డిగ్రీలకు మించి ఎండలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ దారులు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బంది కలిగిస్తోంది. ఈ కారణంగా అందుబాటులో ఉన్న సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖల సిబ్బంది ద్వారా వెంటనే లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలి’’ అని లేఖలో కోరారు.

ఇవి కూడా చదవండి

AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 04:18 PM