Share News

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

ABN , Publish Date - Jan 21 , 2024 | 08:03 AM

రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.

 Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

లక్నో: మరికొన్ని గంటల్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. దేశ, విదేశాల నుంచి అతిథులు తరలి వస్తున్నారు. రామ మందిర (Ram Mandir) ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు. వీధుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దని పోలీసులు స్పష్టంచేశారు. అనుమతి లేకుండా ఊరేగింపులు చేయొద్దని, ప్రదర్శనలు చేపట్టొద్దని ఉత్తర్వుల్లో గౌతమ్ బుద్దనగర్ పోలీసులు పేర్కొన్నారు.

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత 25వ తేదీన హజ్రత్ అలీ జయంతి వేడుకలు జరుగుతాయి. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోవ్సత వేడుకలు నిర్వహిస్తారు. వరసగా కార్యక్రమాలు ఉండటంతో నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్ కొనసాగుతుంది. వివిధ సంస్థలు, ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు చేస్తారనే ఉద్దేశంతో గుమికూడి ఉండొద్దని లా అండ్ ఆర్డర్ డీసీపీ హృదేశ్ కతేరియా వెల్లడించారు. సంఘ విద్రోహా శక్తులు శాంతికి విఘాతం కలగించే అవకాశం ఉందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని వివరించారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 21 , 2024 | 08:03 AM