Election Commission of India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇద్దరు ఈసీల నియామకం..
ABN , Publish Date - Mar 13 , 2024 | 05:45 PM
Election Commission of India: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. వీరి నియామకానికి సంబంధించి బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా (రిటైర్డ్ ఐఏఎస్)(Rajesh Kumar Gupta), ప్రియాన్ష్ శర్మ (రిటైర్డ్ ఐఏఎస్)(Priyansh Sharma) లను నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం.
Election Commission of India: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది ప్రభుత్వం. వీరి నియామకానికి సంబంధించి బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ రాజేష్ కుమార్ గుప్తా (రిటైర్డ్ ఐఏఎస్)(Rajesh Kumar Gupta), ప్రియాన్ష్ శర్మ (రిటైర్డ్ ఐఏఎస్)(Priyansh Sharma) లను నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక చట్టం 2023 ప్రకారం.. ఉన్నతస్థాయి కమిటీ(High Powered Committee) ఇద్దరు కమిషనర్లను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో సభ్యులుగా భారత ప్రధాన మంత్రి, లోక్‌సభ విపక్ష నేత, కేంద్ర హోంమంత్రి సభ్యులుగా ఉంటారు. బుధవారం అంటే మార్చి 13వ తేదీ నుంచే ఈ కమిషనర్ల నియామకం అమల్లోకి వస్తుంది. వీరి నియామకానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు.
కాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సహా మరో ఇద్దరు కమిషనర్లు ఉంటారు. వీరిలో ఒక కమిషనర్ గతంలోనే రాజీనామా చేయగా.. ఇటీవల అరుణ్ గోయెల్ సైతం తన కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఖాళీ అవడంతో.. కొత్తగా ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.