Share News

Elections 2024: అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ.. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాహుల్ ఫైర్..

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:21 PM

ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి ఛాంపియన్ అని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని ఆరోపించారు.

Elections 2024: అవినీతికి ఛాంపియన్ ప్రధాని మోదీ.. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాహుల్ ఫైర్..

ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి ఛాంపియన్ అని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం అని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి రాహుల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రిప్డ్ అని విమర్శించారు. పారదర్శకత కోసం ఎన్నికల బాండ్లను తీసుకొచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. అదే నిజమైతే ఆ వ్యవస్థను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. “ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం. దేశంలోని వ్యాపారవేత్తలందరూ దీన్ని అర్థం చేసుకున్నారు. ప్రధానమంత్రి ఎంత స్పష్టత ఇవ్వాలనుకున్నా దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రధాని అవినీతికి నాయకుడని దేశం మొత్తానికి తెలుసు" అని రాహుల్ గాంధీ రాహుల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

PM Modi: ఈ శుభ సందర్భంలో నా మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది.. ప్రధాని మోదీ


ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ పథకంపై స్పందించిన మోదీ ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయాల్లో నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. దర్యాప్తు సంస్థల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన 16 కంపెనీలు ఇచ్చిన మొత్తం విరాళాలలో కేవలం 37 శాతం మాత్రమే బీజేపీకి, మిగతా 63 శాతం ప్రతిపక్ష పార్టీలకు చేరాయని మోదీ వివరించారు.


Ayodhya: సూర్య తిలకానికి సిద్ధమైన సాకేతపురి.. జై శ్రీరామ్ నినాదంతో మారు మోగుతున్న అయోధ్య..

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ఒకవైపు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ చెప్పారు. ఈ ఎన్నికలలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య కాగా రెండో సమస్యగా ద్రవ్యోల్బణం ఉందన్నారు. కానీ ఈ సమస్యలపై ప్రధాని గానీ, బీజేపీ గానీ మాట్లాడడం లేదని విమర్శించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 12:22 PM