Share News

Mumbai: భారతదేశంలో అతి పొడవైన వంతెన.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:08 PM

భారతదేశంలో పొడవైన సముద్ర వంతెన నిర్మాణం పూర్తయింది. ముంబయి నుంచి నవీ ముంబయిని కలుపుతూ 22 కిలోమీటర్ల

Mumbai: భారతదేశంలో అతి పొడవైన వంతెన.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

భారతదేశంలో పొడవైన సముద్ర వంతెన నిర్మాణం పూర్తయింది. ముంబయి నుంచి నవీ ముంబయిని కలుపుతూ 22 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 12 న ప్రారంభించనున్నారు. దీంతో దక్షిణ ముంబయి నుంచి నవీ ముంబయికి కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ వంతెనపై అన్ని రకాల వాహనాలు నడిచేందుకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ లో నాలుగు చక్రాల వాహనాల గరిష్ఠ వేగ పరిమితి గంటకు 100 కిమీగా ఉంటుందని ముంబయి పోలీసులు తెలిపారు. ఈ వంతెనపై మోటార్‌ బైక్‌లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు వెళ్లేందుకు అనుమతి లేదు.

ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీదుగా ఈ బ్రిడ్జికి అటల్ సేతు అని నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీనిని జనవరి 12 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వంతెన ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వాహనాల వేగ పరిమితి గంటకు 40 కి.మీ.లుగా ఉండనుంది. అసౌకర్యాలు, ప్రమాదాలు, అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకు ఈ వంతెనను నిర్మించినట్లు ఓ అధికారి తెలిపారు. రూ.18,000 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు.

సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కిలోమీటర్లు ఉంది. ఇది వినియోగంలోకి వస్తే రెండు గంటల ప్రయాణం కాస్తా 20 నిమిషాల్లోనే పూర్తి కానుంది. మల్టీ-యాక్సిల్ భారీ వాహనాలు, ట్రక్కులు, బస్సులకు ఈ బ్రిడ్జిపై అనుమతి లేదు. ఈ వాహనాలు ముంబయి పోర్ట్-సివారీ ఎగ్జిట్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. మోటారు సైకిళ్లు, మోపెడ్‌లు, త్రీవీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లు, జంతువులతో నడిచే వాహనాలు, నెమ్మదిగా వెళ్లే వాహనాలకు ప్రవేశం ఉండదని వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 12:08 PM