Share News

PM Modi: అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

ABN , Publish Date - May 23 , 2024 | 10:06 PM

అధికారం కోసం విపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఎంతకైనా తెగిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

PM Modi: అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ

చండీగఢ్: అధికారం కోసం విపక్ష ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఎంతకైనా తెగిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.


ఆయన మాట్లాడుతూ.. "2024 ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇండియా కూటమి మతం, కులం, రాజవంశ రాజకీయాలతో ఓట్ల లబ్ధి పొందాలని చూస్తుంది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దేశ విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను పణంగా పెట్టి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. మైనారిటీ వర్గాలని చెప్పుకుంటూ అక్రమంగా వలస వచ్చిన వారికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు టీఎంసీ ప్రయత్నించగా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వ వాదనను తిరస్కరించింది.

కశ్మీర్‌లో 70 ఏళ్లుగా భారత జెండా ఎగరేయకుండా కాంగ్రెస్ అడ్డుపడింది. ఆర్టికల్ 370రద్దు చేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛావాయువును అందించాం. గత ప్రభుత్వాలు హర్యానా యువతను మోసగించాయి. వచ్చే ఐదేళ్లలో సెమీకండక్టర్, డ్రోన్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టార్టప్ రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తాం. రైతులకు కనీస మద్దతు ధర(MSP) అందించడంపై బీజేపీ దృష్టి పెట్టింది" అని మోదీ పేర్కొన్నారు.

For More National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 10:07 PM