PM Modi : 109 రకాల కొత్త వంగడాలు విడుదల
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:54 AM
ఏ రకమైన వాతావరణాన్నయినా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఏ రకమైన వాతావరణాన్నయినా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్)లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా వంగడాలు, సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యత వంటి అంశాలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఆయన చర్చించారు.
చిరుధాన్యాల ప్రాముఖ్యతను మోదీ ఈ సందర్భంగా వివరించారు. సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్ పెరిగిందని ప్రజలు అటువంటి ఆహారాన్నే ఇష్టపడుతున్నారని వెల్లడించారు. కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన వ్యవసాయ శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు.
అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కొత్త వంగడాలు రైతుల ఆదాయాన్ని పెంచుతాయని, ప్రకృతి సిద్ధమైన వీటి విత్తనాలు మంచి దిగుబడినిస్తాయని చెప్పారు.