Share News

National: ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజారిటీ వర్గాలు

ABN , Publish Date - May 27 , 2024 | 04:40 AM

శంలోని మెజారిటీ వర్గాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలన్నదే ఇండియా కూటమి ఉద్దేశమని ప్రధాని మోదీ ఆరోపించారు.

National: ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజారిటీ వర్గాలు

‘ఇండియా’ పార్టీల ఉద్దేశం ఇదే: మోదీ

మవూ/దేవారియా(యూపీ), మే 26: దేశంలోని మెజారిటీ వర్గాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలన్నదే ఇండియా కూటమి ఉద్దేశమని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ పూర్వాంచల్‌ ప్రాంతంలోని ఘోసి, దేవారియా నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు.

ఇండియా కూటమి చేస్తున్న మూడు భారీ కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేయడానికే తాను వచ్చినట్లు చెప్పారు. ‘ముందుగా వారు రాజ్యాంగాన్ని మార్చి, దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కొత్తగా రాస్తారు. రెండోది.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇక మూడోది... వారు మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేస్తారు. ఓబీసీ రిజర్వేషన్లను తప్పించేందుకే మూడో పద్ధతిని రూపొందించారు.

రాత్రికి రాత్రి ముస్లిం కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తున్నారు’’ అని మోదీ ఆరోపించారు. దేశంలో ఓట్‌ జిహాద్‌కు పిలుపునిస్తున్న కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు సరిహద్దు వెంబడి ఉన్న జిహాదీలు మద్దతిస్తున్నారని, ఈ పార్టీల గెలుపు కోసం పాకిస్థాన్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు.

Updated Date - May 27 , 2024 | 04:40 AM