Share News

karnataka: బెంగళూర్‌లో పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నాం: సీఎం సిద్ధరామయ్య

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:36 PM

బెంగళూరు నగరాన్ని పీడిస్తున్న శాంతిభద్రతల సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బెంగళూరు నగరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.

karnataka: బెంగళూర్‌లో పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నాం: సీఎం సిద్ధరామయ్య

బెంగళూర్: బెంగళూరు నగరాన్ని పట్టిపీడిస్తున్న శాంతిభద్రతల సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య (Siddarmaiah) ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బెంగళూరు నగరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. శాంతి భద్రతల సవాళ్లను అధిగమించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికే ప్రథమ స్థానం అని, తద్వారా పౌరులకు నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడం మనందరి బాధ్యత అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య సూచించారు.

‘ప్రపంచంలో గల ఐటీ హబ్ లలో బెంగళూరు ఒకటి కావడం మనకు గర్వకారణం. ఇది కేవలం నగరం కాదు. ఆవిష్కరణ పురోగతికి చిహ్నం. మౌలిక సదుపాయాలు, జీవన నాణ్యత, పౌర సౌకర్యాలు వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా బెంగళూరు అభివృద్ధి చెందడానికి, ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి కర్ణాటక ముఖ్యమంత్రిగా నేను కట్టుబడి ఉన్నాను. బెంగళూరును స్మార్ట్, గ్రీన్, క్లీన్ గా తీర్చిదిద్దాలనుకోవడం కేవలం ప్రకటన మాత్రమే కాదు. బ్రాండ్ బెంగళూరు ద్వారా ఇప్పటికే ప్రయాణం ప్రారంభమైంది" అని ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అన్నారు.

ఇటీవల సమర్పించిన రాష్ట్ర బడ్జెట్‌లో బెంగళూరుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేవలం మెట్రో లైన్లు, రోడ్లు, శాంతిభద్రతల సమస్యలు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటు ధరలో వైద్యం, విద్య, ఇళ్లు, నిత్యావసరాలు అందించాలని సీఎం సిద్ధారామయ్య తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 04:36 PM