Share News

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

ABN , Publish Date - Jan 30 , 2024 | 09:33 AM

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు.

Ayodhya: అయోధ్య వెళ్లినందుకు బెదిరింపులు.. వెనక్కి తగ్గేది లేదన్న ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైనందుకు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రధాన మతగురువు డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీ ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం కార్యక్రమానికి హాజరైనప్పటి నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఇమామ్ వెల్లడించారు. రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. కానీ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

"శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి నాకు ఆహ్వానం అందింది. రెండు రోజులు ఆలోచించి, దేశం, సామరస్యం కోసం అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇలా చేసినందుకు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఫత్వా జారీ చేశారు" అని ఇలియాసీ పేర్కొన్నారు. వివాదాలు చుట్టుముట్టినప్పటికీ తన సంఘం నుంచి ఎదురవుతున్న పరిస్థితులకు అధైర్యపడకుండా ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడంలో నిబద్ధతతో ఉన్నానని ఇలియాసీ పేర్కొన్నారు.


కాగా.. రామ్‌లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 30 , 2024 | 09:36 AM