Share News

Lok Sabha Elections 2024: మోదీ, అమిత్‌షాలను 'జై-వీరు'లతో పోల్చిన హేమమాలిని

ABN , Publish Date - Apr 23 , 2024 | 06:27 PM

'జై-వీరు' పేర్లు చెప్పగానే 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ధర్మేంద్ర సరసన కథానాయకిగా నటించిన హేమమాలిని తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను భారత రాజకీయాల్లో 'జై-వీరు'లతో పోల్చారు. విపక్షాలను 'గబ్బర్'గా అభివర్ణించారు.

Lok Sabha Elections 2024: మోదీ, అమిత్‌షాలను 'జై-వీరు'లతో పోల్చిన హేమమాలిని

న్యూఢిల్లీ: 'జై-వీరు' పేర్లు చెప్పగానే 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ధర్మేంద్ర సరసన కథానాయకిగా నటించిన హేమమాలిని తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలను భారత రాజకీయాల్లో 'జై-వీరు'లతో పోల్చారు. విపక్షాలను 'గబ్బర్'గా అభివర్ణించారు. మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న హేమమాలిని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ పోలిక తెచ్చారు. ఇండియన్ పాలిటిక్స్‌లో 'జై-వీరు'లుగా ఎవరిని మీరు అనుకుంటున్నారనే ప్రశ్నకు 'మోదీ, అమిత్‌షా' అని సూటి సమాధానం ఇచ్చారు.


గబ్బర్ సింగ్ ఎవరంటే..

బీజేపీయేతర విపక్ష పార్టీలన్నింటినీ భారతీయ రాజకీయాల్లో గబ్బర్ సింగ్ (షోలో చిత్రంలో విలన్ పాత్రపేరు)తో హేమమాలిని పోల్చిచెప్పారు. రాహుల్ గాంధీ గురించి ముక్తసరిగా సమాధానమిస్తూ, ఆయన మాటలు, చేష్టలు ఏమాత్రం సీరియస్‌గా అనిపించవని, నవ్వుకునేలా ఉంటాయని అన్నారు. ఇంతకుమించి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని చెప్పారు.

Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే షరియా చట్టం తెస్తారు.. యోగి తీవ్ర ఆరోపణ


'ఔట్ సైడర్' వ్యాఖ్యలపై...

మధుర నియోజకవర్గంలో స్థానికుడు, బయట వ్యక్తి (local and outsider) అంశంపై ప్రశ్నించినప్పుడు, తాను ముంబై నుంచి వేరే ప్రొఫెషన్ కోసం వచ్చానని, ఈ ప్రాంత (మధుర) అభివృద్ధికి నిరంతరం పనిచేశానని చెప్పారు. మొదటిసారి మధుర ఎంపీగా గెలిచినప్పుడు అభివృద్ధి పనులు చేపట్టానని, రెండో టర్మ్‌లో రోడ్ల సుందరీకరణ, హైవేలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి కృషి చేశానని చెప్పారు. రూ.4,00 కోట్లతో చేపట్టిన ఫిలిబిత్-బరేలీ హైవే మధుర మీదుగా వెళ్ళనుందని, సగం పని పూర్తయిందని, దీనితో ట్రాఫిక్ జామ్‌లకు తెరపడుతుందని వివరించారు.


ఎంతవరకూ రాజకీయాల్లో అంటే..

రాజకీయాల్లో ఎంతవరకూ ఉంటారని ప్రశ్నకు హేమమాలిని నవ్వుతూ సమాధానమిచ్చారు. ''బ్రిజ్‌భూమి (మధుర)కి ఎంతవరకూ సేవలు చేయాలని శ్రీకృష్ణ భగవానుడు కోరుకుంటాడో అంతవరకూ. ఇక చాలని ఆయన చెప్పినప్పుడు నేను వెళ్లిపోతా. నన్నెవరూ ఆపలేరు" అని డ్రీమ్‌గాళ్ సమాధానమిచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 06:44 PM