Share News

Maharashtra: మనోజ్ వ్యాఖ్యల వెనక శరద్ పవార్, బీజేపీ విసుర్లు

ABN , Publish Date - Feb 27 , 2024 | 02:04 PM

మరాఠీలకు రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మనోజ్ జారంగే ఉద్యమిస్తున్నారు. తనను హత్య చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మనోజ్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. శరద్ పవార్ మనోజ్ చేత ఆరోపణలు చేయించారని మండిపడింది.

Maharashtra: మనోజ్ వ్యాఖ్యల వెనక శరద్ పవార్, బీజేపీ విసుర్లు

ముంబై: మరాఠీలకు రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో (Maharashtra) మనోజ్ జారంగే (Manoj) ఉద్యమిస్తున్నారు. తనను హత్య చేసేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. విషంతో కూడిన సెలైన్ ఎక్కించే ప్రయత్నం చేసిందని తెలిపారు. తనను హతమార్చేందుకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ప్రయత్నించారని ఆరోపించారు. మనోజ్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండించింది.

బీజేపీ సభ్యుడి ఆరోపణలు

‘మనోజ్ జారంగేతో శరద్ పవార్ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఫడ్నవీస్‌ మీద ఆరోపణలు చేయాలని ప్రోత్సహించారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. మహారాష్ట్రలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించారు అని’ మహారాష్ట్ర కౌన్సిల్‌లో బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ అన్నారు. ప్రవీణ్ వ్యాఖ్యలను విపక్షాలు ఖండించాయి. దీంతో సభ ఐదు నిమిషాల పాటు వాయిదా పడింది.

మనోజ్ ఏమన్నారంటే..?

మరాఠీలకు రిజర్వేషన్ల కోసం మనోజ్ జారంగే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ ఇంటి ముందు ఆందోళన చేస్తానని ప్రకటించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆ ప్రకటనను విరమించుకున్నారు. ఆదివారం నాడు జల్నాలో మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. మంగళవారం నాడు సభలో బీజేపీ సభ్యుడు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 27 , 2024 | 02:04 PM