Share News

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

ABN , Publish Date - May 01 , 2024 | 03:00 PM

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.

Lok Sabha Elections: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు.. బీజేపీకి సింహభాగం

ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అధికార కూటమి మధ్య సీట్ల పంపకాలపై బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 28 సీట్లలో పోటీ చేయంది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 15 సీట్లలో, ఎన్‌సీపీ (అజిత్ పవార్) 4 సీట్లతో పోటీ చేస్తున్నాయి.

విపక్ష కూటమి సీట్లు..

మహారాష్ట్రలో విపక్ష కూటమి మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం ప్రకారం శివసేన (యూబీటీ) 21 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) 10 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకోగా, శివసేనలో చీలకతో 2023 జూన్‌లో ఆ ప్రభుత్వం కూలిపోయింది.

LokSabha Elections: కొన్ని గంటల్లో అమేథీ, రాయబరేలి అభ్యర్థుల ఎంపిక

మొదటి రెండు విడతల్లో...

కాగా, మహారాష్ట్రలో ఇంతవరకూ 2 విడతల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 63.70 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతో 62.65 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తాజా గణాంకాలు చెబుతున్నాయి.

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 03:11 PM