Share News

Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:05 PM

దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.

Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే

న్యూఢిల్లీ: దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు. అలాంటి త్యాగాలు బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్‌ కానీ చేశాయా అని ఖర్గే ప్రశ్నించారు.


''దేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన త్యాగాలు ఏమిటి? కనీసం జాతీయోద్యమంలో కూడా వాళ్లు పాల్గొనలేదు. ఎన్నికల కోసం ప్రజల మంగళసూత్రాలు సురక్షితం కావంటూ మోదీ అబద్ధాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని 55 ఏళ్లు పాలించింది. ఒక్కసారైనా ఇలాంటివి జరిగాయా? 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారు. పండిట్ మోతీలాల్ నెహ్రూ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్‌లోని తమ ఇంటిని స్వాంతత్రోద్యమం కోసం డొనేట్ చేశారు. మా నాయకులు దేశం కోశం బతికారు, దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు'' అని ఖర్గే బుధవారంనాడు జరిపిన మీడియా సమావేశంలో తెలిపారు.

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’


మోదీ ఏమన్నారు?

దీనికి ముందు గతవారంలో మోదీ మాట్లాడుతూ, ప్రజల సంపదను, నగల్ని కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచాలనుకుంటోందని విమర్శించారు. సంపద పునఃపంపిణీ కాంగ్రెస్ ఉద్దేశమని, ఇందుకోసం సర్వే నిర్వహించి, చివరకు మహిళల మంగళసూత్రాలను కూడా ఊడలాక్కుంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేశ వనరులపై మొదటి హక్కు ముస్లింలదేనంటూ ప్రకటించిందని, అందుకు అనుగుణంగా ప్రజల సంపద, నగలను దోచుకుని ఎక్కువమంది పిల్లలున్న వారికి, అక్రమ వలసదారులకు పంచుతుందన్నారు. అర్బన్ నక్సలిజం ఆలోచన వల్ల ప్రజల మంగళసూత్రాలు కూడా సురక్షితం కావని హెచ్చరించారు.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 03:10 PM