Share News

Anantkumar Hegde: ఇందిరా, సంజయ్ గాంధీ అందుకే చనిపోయారు..! కేంద్ర మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 14 , 2024 | 10:44 AM

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరు గోవుల శాపానికి గురయ్యారని ఆరోపించారు.

Anantkumar Hegde: ఇందిరా, సంజయ్ గాంధీ అందుకే చనిపోయారు..!  కేంద్ర మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

బెంగళూర్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi), ఆమె కుమారుడు సంజయ్ గాంధీపై (Sanjay Gandhi) కేంద్ర మాజీమంత్రి, ఎంపీ అనంత్ కుమార్ (Anantkumar Hegde) హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరు గోవుల శాపానికి గురయ్యారని ఆరోపించారు. గో హత్యల నిషేధం కోసం ఓ సన్యాసి ఇచ్చిన శాపం ఫలితంగా చనిపోయారని ధ్వజమెత్తారు. కుంటలో శనివారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడారు.

వెంటాడిన గోవద పాపం

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గోవద నిషేధించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళన చేపట్టిన సాధువులపై లాఠీఛార్జీ జరిగింది. పదుల సంఖ్యలో సాధువులు చనిపోయారు. గోవుల హత్య కూడా జరిగింది. సన్యాసి కర్పాత్రి మహారాజ్ ఇందిరాగాంధీని శంపించారని అనంత్ హెగ్డే గుర్తుచేశారు. గోపాష్టమి రోజున ఇందిరాగాంధీ వంశం నాశనం అవుతుందని శపించాడని తెలిపారు. గోపాష్టమి రోజున సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మృతిచెందాడు. ఇందిరాగాంధీని సెక్యూరిటీ గార్డ్స్ గోపాష్టడి రోజున కాల్చి చంపారు. సన్యాసి శాపంతోనే వారు చనిపోయారని హెగ్డే అంటున్నారు.

బాబ్రీ మసీదు గతే..!

కర్ణాటకలో ఉన్న భక్తల్ మసీదుకు బాబ్రీ మసీదుకు పట్టిన గతి పడుతుందన్నారు. ఇది తన అభిప్రాయం కాదని, హిందూ సమాజం కోరుకుంటుందని హెగ్డే తెలిపారు. 1992లో హిందు కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన సంగతి తెలిసిందే. హిందూ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ శతాబ్దాలుగా విభజించిందని హెగ్డే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేకం, సనాతన ధర్మ వ్యతిరేకం అని హెగ్డే మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 14 , 2024 | 10:44 AM