Share News

Loksabha Polls: బిల్కిస్ బానోకు న్యాయం చేయడంలో మోదీ సర్కార్ విఫలం

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:02 PM

పశ్చిమ బెంగాల్‌ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య తీవ్ర మాటల యుద్దం జరుగుతోంది. కూచ్ బెహర్‌లో ఇద్దరు నేతలు నిన్న బహిరంగ సభల్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆరోపణలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. జల్పాయ్ గురిలో జరిగిన ర్యాలీలో మమత మాట్లాడుతూ.. సందేళ్ ఖాళిలో మహిళలను లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని దీదీ వివరించారు.

Loksabha Polls: బిల్కిస్ బానోకు న్యాయం చేయడంలో మోదీ సర్కార్ విఫలం
Failed To Deliver Justice To Bilkis Bano Bengal CM Mamata Slams PM Modi

కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (pm modi), బెంగాల్ సీఎం మమత బెనర్జీ మధ్య తీవ్ర మాటల యుద్దం జరుగుతోంది. కూచ్ బెహర్‌లో ఇద్దరు నేతలు నిన్న బహిరంగ సభల్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఆరోపణలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. జల్పాయ్ గురిలో జరిగిన ర్యాలీలో మమత మాట్లాడుతూ.. సందేళ్ ఖాళిలో మహిళలపై లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని దీదీ వివరించారు. తమ ప్రభుత్వం చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం అని ఖండించారు.


సందేశ్ ఖాళి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. సందేశ్ ఖాళి సింగూర్ లేదంటే నందిగ్రామ్ కాదు. ఇక్కడ కొన్ని ఘటనలు జరిగాయి. అందుకు బాధ్యులను అరెస్ట్ చేశాం. ఆక్రమించిన భూములను కూడా తిరిగి ఇచ్చేశాం. ప్రధాని మోదీ హత్రాస్‌కు ఎన్ని సార్లు వెళ్లారు. లైంగికదాడికి గురైన దళిత బాధితురాలిని రాత్రిపూట సజీవ దహనం చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రధాని మోదీ విఫలం అయ్యారు. బిల్కిస్ బానోకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించారు. ప్రధాని మోదీపై చేసిన కామెంట్లతో ఆమెకు మతి తప్పినట్టు ఉందని అర్థమవుతోందని బెంగాల్ బీజేపీ నేతలు తిప్పికొట్టారు.


ఇవి కూడా చదవండి:

Maharashtra: బీజేపీ నేత సంచలనం: థాకరే అవినీతి బయట పెట్టాలని ఆదేశం


Rain: ఎండల నుంచి ఉపశమనం.. తెలంగాణలో 3 రోజులు వర్షాలు

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 10:02 PM