Share News

Maharashtra: బీజేపీ నేత సంచలనం: థాకరే అవినీతి బయట పెట్టాలని ఆదేశం

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:52 PM

మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాకరే అవినీతి వివరాలు బయటపెట్టాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించిందని బాంబ్ పేల్చారు. తనకు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారని.. తొలుత ససేమిరా అన్నానని గుర్తుచేశారు.

Maharashtra: బీజేపీ నేత సంచలనం: థాకరే అవినీతి బయట పెట్టాలని ఆదేశం
Devendra Fadnavis Asked Me To Expose Uddhav Thackeray's Corruption

ముంబై: మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ కిరిట్ సోమయ్య (Kirit Somaiya) సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన (Shivasena) యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) అవినీతి వివరాలు బయటపెట్టాలని బీజేపీ (BJP) హైకమాండ్ ఆదేశించిందని బాంబ్ పేల్చారు. తనకు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారని.. తొలుత ససేమిరా అన్నానని గుర్తుచేశారు. చివరికి తనను ఫడ్నవీస్ ఒప్పించారని ఓ ఇంటర్వ్యూలో కిరిట్ సోమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఇది జరిగిందని సోమయ్య వివరించారు.


ప్రతిఘటన

బీఎంసీ కాంట్రాక్టర్లు, ఉద్దవ్ థాకరే మధ్య జరిగిన అంశాలను బయటపెట్టే బాధ్యత తనకు అప్పగించారని సోమయ్య స్పష్టం చేశారు. తనకు అప్పగించిన పని చేసే సమయంలో శివసేన కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురైందని సోమయ్య వెల్లడించారు. ముంబైలో జరిగిన అవినీతిని బయటపెట్టడం తన బాధ్యత. హసన్ ముష్రిఫ్ నుంచి థాకరే వరకు జరిగిన స్కాం బయటపెట్టడం తన పని. ప్రతి ముంబైకర్ ఈ విధంగా పనిచేస్తాడు. బీజేపీకి విధేయుడిని అయిన కార్యకర్తను తాను అని’ సోమయ్య తెలిపారు.


శరద్ పవార్ కాపాడారు.

నాసిక్‌లో ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ బినామీ ఆస్తులను పరిశీలించేందుకు వెళ్లే సమయంలో తనపై భుజబల్ మద్దతుదారులు దాడి చేయబోయరని సోమయ్య గుర్తు చేశారు. ఆ సమయంలో తనకు శరద్ పవార్ అండగా నిలిచారని, దాడి చేయకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఛగన్ భుజబల్ ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గంలో కీలక నేత. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ అనే సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 05 , 2024 | 03:58 PM