Share News

ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు: ప్రియాంక

ABN , Publish Date - May 27 , 2024 | 04:19 AM

బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందంటున్నారని... మరి ప్రజల జీవితాల్లో మార్పెందుకు రావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ బీజేపీ నేతలను ప్రశ్నించారు.

ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్ధాలు: ప్రియాంక

ఫతేగర్‌ సాహిబ్‌, పటియాల, మే 26: బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందంటున్నారని... మరి ప్రజల జీవితాల్లో మార్పెందుకు రావడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ బీజేపీ నేతలను ప్రశ్నించారు. ధరలెందుకు పెరిగాయన్నారు. పంజాబ్‌లోని ఫతేగర్‌ సాహిబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అమర్‌ సింగ్‌ తరఫున ఆదివారం ప్రచారం చేశారు.

మోదీ అబద్ధాలు చెప్పి, ఉట్టుట్టి హామీలు ఇచ్చి మళ్లీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని, 70 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని చెప్పారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

Updated Date - May 27 , 2024 | 04:19 AM