Share News

Social Media: వారి అకౌంట్లను బ్లాక్ చేసిన X.. అయినప్పటికీ విభేదిస్తున్నట్లు వెల్లడి

ABN , Publish Date - Feb 22 , 2024 | 11:52 AM

దేశంలో ఇటివల రైతుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా ఎక్స్‌పై ఆంక్షలు మొదలయ్యాయి. రైతుల నిరసనలకు సంబంధం ఉన్న నిర్దిష్ట ఖాతాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం X (గతంలో ట్విట్టర్)కు ఆదేశాలు జారీ చేసింది.

Social Media: వారి అకౌంట్లను బ్లాక్ చేసిన X.. అయినప్పటికీ విభేదిస్తున్నట్లు వెల్లడి

దేశంలో ఇటివల రైతుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియా(social media) ఎక్స్‌పై ఆంక్షలు మొదలయ్యాయి. రైతుల నిరసనలకు సంబంధం ఉన్న నిర్దిష్ట ఖాతాలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం X (గతంలో ట్విట్టర్)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ చర్యలతో తాము విభేదిస్తున్నామని, భావ ప్రకటనా స్వేచ్ఛను సాకుగా చూపి పోస్టులను నిలుపుదల చేయరాదని సోషల్ మీడియా వేదిక ఎక్స్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో జైలు శిక్షతో సహా నిర్దిష్ట ఖాతాలు, పోస్ట్‌లపై X చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తాము దేశంలో(India) పలువురి ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ తాము ఈ చర్యలతో విభేదిస్తున్నామని వెల్లడించింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, మేము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లను ప్రచురించలేకపోతున్నాము. కానీ పారదర్శకత కోసం ఈ విషయాన్ని పబ్లిక్‌ చేయడం అవసరమని విశ్వసిస్తున్నట్లు ఎక్స్ తెలిపింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Farmers Protest: రైతుల ఆందోళనకు రెండు రోజులు బ్రేక్..

Updated Date - Feb 22 , 2024 | 11:53 AM