Share News

Farmers Protest: రైతుల ఆందోళనకు రెండు రోజులు బ్రేక్..

ABN , Publish Date - Feb 22 , 2024 | 09:20 AM

ఆందోళనకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులపై నిన్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పలువురు రైతులు గాయపడ్డారు. కనౌరి బార్డర్‌లో యువరైతు మృతి చెందాడు.

Farmers Protest: రైతుల ఆందోళనకు రెండు రోజులు బ్రేక్..

ఢిల్లీ: ఆందోళనకు రెండు రోజుల పాటు బ్రేక్ ఇవ్వాలని రైతు సంఘాలు (Delhi Farmers Unions) నిర్ణయించాయి. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నాయి. ఆందోళన చేస్తున్న రైతులపై నిన్న పోలీసులు టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించారు. దీంతో పలువురు రైతులు గాయపడ్డారు. కనౌరి బార్డర్‌లో యువరైతు మృతి చెందాడు. దీంతో రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల దాడిలోనే రైతు ప్రాణం కోల్పోయాడని ఫైర్ అవుతున్నాయి.

రైతుల డిమాండ్లు..

  • పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం. ఇది రైతులకు ఇది కీలకమైన జీవనాధారం.

  • విద్యుత్ సవరణ చట్టం 2020ని రద్దు చేయాలి.

  • ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.

  • 2020లో రైతుల ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసుల్ని ఉపసంహరించుకోవాలి.

  • స్వామినాథన్ కమిషన్ (Swaminathan Commission) సిఫారసులు అమలు చేయాలి.

  • రైతులకు రుణమాఫీ చేయాలి.

కేంద్ర ప్రభుత్వం (Central Government) తమ సమస్యలను పరిష్కరించకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడంతో.. అన్నదాతలు తాజాగా మరోసారి కదం తొక్కారు. చలో ఢిల్లీ పేరుతో హస్తినలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పంజాబ్ (Punjab), హర్యానా రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లతో హస్తినకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. 2020-21 సమయంలో తామంతా ఉద్యమించినప్పుడు డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం వాటిని నెరవేర్చలేదని.. ఇప్పుడు ఆ హామీలను సాధించుకోవడం కోసమే ఈ భారీ ఆందోళన చేపట్టామని రైతులు చెప్తున్నారు.

Updated Date - Feb 22 , 2024 | 10:39 AM