Share News

Lok Sabha polls: 102 స్థానాల్లో ప్రచార వేగం పెంచిన పార్టీలు..!

ABN , Publish Date - Mar 30 , 2024 | 08:54 AM

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగు స్తుండటంతో.. ఎక్కడ ఎవరు పోటీలో ఉండనున్నరో క్లారిటీ రానుంది.

Lok Sabha polls: 102 స్థానాల్లో ప్రచార వేగం పెంచిన పార్టీలు..!

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో 102 లోక్‌సభ (Lok Sabha) స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుండటంతో.. ఎక్కడ ఎవరు పోటీలో ఉండనున్నరో క్లారిటీ రానుంది. దీంతో గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. మొదటిదశలో అత్యధికంగా తమిళనాడు(Tamil Nadu)లోని మొత్తం 39 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం చేసేలా తమ షెడ్యూల్ రెడీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎన్డీయే అభ్యర్థుల తరపున ప్రచారం చేయనుండగా.. కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక, ఖర్గేతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

Lok Sabha 2024: తమిళనాట పొత్తుల్లో కమలం దూకుడు

నామినేషన్ల ఉపసంహరణ..

లోక్‌సభ ఎన్నికల తొలి దశలో పోలింగ్ జరగనున్న 102 స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగుస్తుంది. బీహార్‌లో మాత్ర ఈ గడువు ఏప్రియల్ 2వరకు ఉంది. ఏప్రియల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది.

మొదటి దశలో..

తొలి దశలో తమిళనాడులో 39, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, బీహార్ లో 4, అస్సాంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్రలో 5, మణిపూర్‌లో 2, మేఘాలయలో 2, మిజోరాం లో1, నాగాలాండ్‌లో 1, రాజస్థాన్‌లో12. , సిక్కింలో 1, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమ బెంగాల్‌లో 3, అండమాన్ నికోబార్‌లో 1, జమ్మూ కాశ్మీర్‌లో 1, లక్షద్వీప్, పుదుచ్చేరి లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha polls: ఐదుగురితో కాంగ్రెస్ 9వ జాబితా.. సీనియర్లకు షాక్!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 09:03 AM