Share News

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

ABN , Publish Date - Apr 11 , 2024 | 01:15 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

కొల్‌కత్తా, ఏప్రిల్ 11: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (abhishek banerjee) బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం (Diamond Harbour Lok Sabha seat) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షా (Amit Shah)కు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు. ఈ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచే అత్యత్తమ బీజేపీ అభ్యర్థులు వీరేనని అభిషేక్ బెనర్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

BJP MLAs: బీజేపీ ఎమ్మెల్యేలు... కాంగ్రెస్‌కు ప్రచారం..!

కొల్‌కొత్తలోని రాజ్‌భవన్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా... ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉందన్నారు. అయితే ఈ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిని నిలపడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పారు. ఈ ఘటనతో బెంగాల్‌లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ప్రస్పుటమవుతోందని తెలిపారు. అలాంటి బీజేపీ డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గంపై ఆరోపణలు గుప్పిస్తుందన్నారు. ఈ నియోజకవర్గం ప్రతిష్ట దిగజార్చేందుకే ప్రయత్నిస్తున్నారంటు బీజేపీ నేతలపై ఈ సందర్బంగా మండిపడ్డారు.

Former CM: ‘కుమార’ విందుకు ఎన్నికల అధికారుల చెక్‌.. తోటలో ఏర్పాటు చేసిన కుర్చీలు, షామియానాల తొలగింపు


లోక్ సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీల నేతలను ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ సంస్థలతో బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. అందులో తమ పార్టీ కూడా ఉందన్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్‌తోపాటు ఎన్నికల సంఘానికి లేఖ రాశామని.. అయినా ఫలితం లేదని ఈ సందర్భంగా ఆయన పెదవి విరిచారు.

PM Modi: 14న మంగళూరుకు ప్రధాని మోదీ.. అదేరోజు బెంగళూరు ఉత్తరలో రోడ్‌షో.. మండ్యలో ప్రచారానికి రాహుల్‌..

2014 ఎన్నికల నాటి నుంచి ఈ డైమండ్ హార్బర్ లోక్ సభ స్థానం నుంచి వరుసగా అభిషేక్ బెనర్జీ గెలుస్తూ వస్తున్నారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి అభిషేక్ బెనర్జీ స్వయానా మేనల్లుడు. అంతేకాదు ఆ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అభిషేక్ బెనర్జీ ఉన్నారు. ఆ క్రమంలోనే మోదీ ప్రభుత్వంలోని నేతలు అభిషేక్ బెనర్జీని రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని తృణముల్ నేతలు వాదిస్తున్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 11 , 2024 | 03:13 PM